వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వారీ కింగ్ శేఖర్ రెడ్డికి రూ. 33 కోట్ల రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి: సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇసుక క్వారీల కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అక్రమ నగదు లావాదేవీలపై మీరు ఎలాంటి విచారణ చేశారు ? ఆ వివరాలు ఏమిటీ, బ్యాంకు అధికారులను ప్రశ్నించారా ? లేదా ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

సోమవారం మద్రాస్ హైకోర్టులో శేఖర్ రెడ్డి అక్రమ నగదు లావాదేవీల వ్యవహారం కేసు విచారణ జరిగింది. పెద్ద నోట్లు రద్దు అయిన నెల తరువాత సీబీఐ అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిలో సోదాలు చేసి రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Madras HC question CBI in Sekhar Reddy’s money laundering case

పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత శేఖర్ రెడ్డి చేతికి రూ. 33 కోట్ల రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి అని మీరు దర్యాప్తు చేశారా అంటూ మద్రాస్ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. శేఖర్ రెడ్డి చేతికి రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఇచ్చిన బ్యాంకులు ఏవి, ఆ అధికారులు ఎవరు అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.

శేఖర్ రెడ్డి చేతికి అక్రమంగా నగదు రావడానికి కారణం అయిన బ్యాంకు అధికారులు ఎవరు అనే పూర్తి సమాచారం అక్టోబర్ 25వ తేదీలోపు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈడీ అధికారులు సైతం శేఖర్ రెడ్డికి చెందిన రూ. 34 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను జప్తు చేసింది.

English summary
The Madras high court, on Monday, wanted the CBI to explain how mining baron Sekhar Reddy was able to get loads of new Rs 2,000 currency notes after demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X