వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పదవి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు, నకిలీ పత్రాలు ఇచ్చారు, ఈసీకి శశికళ లేఖ !

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పంచాయితిఎన్నికలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు, ఈసీకి లేఖ రాసిన చిన్నమ్మపళనిసామి, పన్నీర్ సెల్వం నకిలీ పత్రాలు ఇచ్చారని ఎన్నికల కమిషన్ కు శశికళ ఫిర

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు భారత ఎన్నికల కమిషన్ కు సూచించింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకులు ఎవరి వైపు ఉన్నారో తేల్చాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేస్తూ ఇటీవల సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుందని తమిళనాడులోని పోల్లాచ్చికి చెందిన ఆ పార్టీ నాయకుడు నలపెరుమాళ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మద్రాసు హైకోర్టు

మద్రాసు హైకోర్టు

అన్నాడీఎంకే పార్టీ నాయకుడు నలపెరుమాళ్ సమర్పించిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు విచారణకు స్వీకరించారు. నలపెరుమాళ్ తరపున సీనియర్ న్యాయవాది వాదించారు. శశికళ ఎన్నిక చెల్లదని పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

 నాయకులు ఎవరివైపు !

నాయకులు ఎవరివైపు !

అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకులు ఎవరి వైపు ఉన్నారు ? అనే విషయాన్ని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టులో వివరించారు. తమిళనాడుతో సహ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలోని పార్టీ నాయకులు 90 శాతం పైగా ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వైపు ఉన్నారని వివరించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలకనేతలు

ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలకనేతలు

అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ప్రధాన కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శశికళ, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ న్యాయవాది కోర్టులో వాదించారు.

 ఎన్నికల కమిషన్

ఎన్నికల కమిషన్

అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ప్రధాన కార్యదర్శులు ఎవరికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు భారత ఎన్నికల కమిషన్ కు సూచించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పార్టీ పదవి ఎన్నికలు నిర్వహించాలని సూచించిన మద్రాసు హైకోర్టు పిటిషన్ విచారణ 27వ తేదీకి వాయిదా వేసింది.

సెంట్రల్ జైలు నుంచి ఈసీకి లేఖ

సెంట్రల్ జైలు నుంచి ఈసీకి లేఖ

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేశారు. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన 1,877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీవని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిన్నమ్మ శశికళ సెంట్రల్ జైలు నుంచి భారత ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఈనెల 30వ తేదీన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఎవరికి ఇస్తున్నామో అనే తీర్పు చెబుతున్న సమయంలో శశికళ అడ్డుచక్రం వెయ్యడానికి ఈసీకి లేఖ రాశారు.

English summary
he Madras High Court, on Tuesday, adjourned to October 27 a petition seeking a direction to the Election Commission and the ruling AIADMK in Tamil Nadu to conduct elections for the party's general secretary post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X