చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తహిల్ రమణి రాజీనామా, బదిలీ చెయ్యడంతో తప్పుకున్నారు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కే. తహిల్ రమణి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇటీవలే జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ కోర్టుకు బదిలి చేశారు. తన బదిలి ప్రతిపాదనను పరిశీలించాలని మనవి చేసినా ఫలితం లేకపోవడంతో జస్టిస్ తహిల్ రమణి మద్రాసు హై కోర్టు చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేశారు. మేఘాలయ హైకోర్టుకు బదిలీ కావడానికి విముఖంగా ఉన్న జస్టిస్ తహిల్ రమణి ఆమె పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

భర్తను చంపేసి జైలుకు వెళ్లింది, నేడు పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో, దుమ్ము లేపేశారు!భర్తను చంపేసి జైలుకు వెళ్లింది, నేడు పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో, దుమ్ము లేపేశారు!

గత ఏడాది ఆగస్టు 8వ తేదీన మద్రాసు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తహిల్ రమణిని నియమించారు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన మేఘాలయ హైకోర్టుకు జస్టిస్ తహిల్ రమణి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన బదిలీ ప్రతిపాదనను పరిశీలించాలని కొద్ది రోజుల క్రితం జస్టిస్ తహిల్ రమణి సుప్రీం కోర్టు కొలీజంకు మనవి చేశారు.

Madras High Court Chief Justice VK Tahil Ramani has sent her resignation papers to President Ram Nath Kovind.

అయితే సుప్రీం కోర్టు కొలీజం జస్టిస్ తహిల్ రమణి మనవిని తిరస్కరించింది. ఈ విషయంలో కలత చెందిన జస్టిస్ తహిల్ రమణి ఆమె పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ తహిల్ రమణి ఆమె రాజీనామా పత్రాల నకలును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ కు పంపించారు.

పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!

2020 అక్టోబర్ లో జస్టిస్ తహిల్ రమణి పదవీ విరమణ పొందనున్నారు. ఇంతలోనే తనను బదిలీ చెయ్యడంతో జస్టిస్ తహిల్ రమణి కలత చెందారు. జస్టిస్ ఎస్ వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ బాబ్దే, ఆర్ఎఫ్ నారీమణ్ లతో కూడిన అపెక్స్ కోర్టు కొలీజం మేఘాలయ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే. మిట్టల్ ను మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది.

English summary
Madras High Court Chief Justice VK Tahil Ramani has sent her resignation papers to President Ram Nath Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X