వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెన్సీపై మహాత్మ వద్దనందుకు రూ. 10 వేలు ఫైన్: తమాషాగా ఉందా, హై కోర్టు సీరియస్ !

భారత కరెన్సీ మీద గాంధీ ముందు మహాత్మ పేరుసవాల్ చేస్తూ మద్రాసు హై కోర్టులో పిటిషన్ వేశాడు, మండిపడిన కోర్టున్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తావా, రూ. 10 వేలు జరిమానా చెల్లించు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత కరెన్సీ నోట్ల మీద గాంధీ ముందు మహాత్మ అనే పదాన్ని వాడటాన్ని నిషేధించాలని కోరూతూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హై కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. కోర్టులు అంటే తమాషాగా ఉందా, న్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తావా అంటూ పిటిషనర్ పై న్యాయమూర్తులు మండిపడ్డారు.

ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు రూ. 10 వేలు అపరాధ రుసుం చెల్లించాలని పిటిషనర్ కు మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్శిటీలో రీసెర్స్ స్కాలర్ గా ఉన్న మురుగనాథమ్ భారత కరెన్సీ మీద గాంధీ పేరు ముందు మహాత్మ అని వాడటం రాజ్యంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Madras High Court dismissed peal against use of word Mahatma in currency

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎం. సుందర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ పిటిషన్ విచారణ చేసింది. ఆర్ బీఐ మహాత్మ అనే పదం వాడటం రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ పిటిషన్ విచారార్హమైనది కాదని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం. సుందర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసి మరో సారి కోర్టు సమయాన్ని వృధా చెయ్యకూడదని పిటిషనర్ ను హెచ్చరించింది. కోర్టు సమయాన్ని వృధా చేసిందుకు మురుగనాథన్ కు మద్రాసు హై కోర్టు రూ. 10 వేలు జరిమానా విధించింది.

English summary
The Madras High Court dismissed a public interest litigation (PIL) petition, seeking a direction to the Union of India, refraining it from using the word ‘Mahatma’ in the Indian currency. A bench comprising Chief Justice Indira Banerjee and Justice M Sundar dismissed the PIL with a cost of Rs 10,000, to be paid to the registrar general of the high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X