వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడి ముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం, నిందితులకిలా?

కృష్ణగిరి గ్యాంగ్ రేప్ నిందితులకు మద్రాస్ హైకోర్టు యావజ్ఝీవ శిక్షను విధించింది.దిగువ కోర్టు విధించిన శిక్షపై బాధితులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మద్రాస్ హైకోర్టు కూడ ఇదే తీర్పును ఇచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఓ యువతిపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారం చేసి, అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. ఈ సంగతి బయటపెడితే ఈ వీడియోను ఇంటర్నెట్ లో పెడతామని నలుగురు నిందితులు బెదిరించారు. ఈ నిందితులకు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది మద్రాసు హైకోర్టు.

2014 లో కృష్ణగిరి జిల్లా సమీపంలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి కారులో వెళ్తోంది. అయితే మార్గమద్యలో మూత్రవిసర్జన కోసం ఆమె రోడ్డు పక్కకు వెళ్ళింది.

అయితే ఆ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విన్న ప్రియుడు కారు వద్ద నుండి యువతి వద్దకు వచ్చాడు.

అయితే యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఆయనను కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం చేసే దృశ్యాలను వీడియో తీశారు.

madras high court sensational verdict:life sentence for krishna giri gang rape convicts

ఈ విషయాన్ని బయటకు చెబితే ఇంటర్నెట్ లో ఈ వీడియోను పెడతామని బెదిరించారు.అయితే నిందితుల బెదిరింపులను పట్టించుకోకపోగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నిందితులు పొడపట్టి గ్రామానికి చెందినవారని గుర్తించారు. రాయకొట్టై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకొన్నారు. కృష్ణగిరి పాష్ట్ ట్రాక్ మహిళా కోర్ట్ సెషన్స్ జడ్జి 2015 లో నిందితులకు జీవిత ఖైధీ విధించారు.

ఈ తీర్పుపై నిందితులు మద్రాస్ హైకోర్టు అప్పీలు చేసుకొన్నారు. అయితే మద్రాస్ హైకోర్టు నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.

దిగువస్థాయి కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. దిగువ కోర్టు బాధితులకు చట్ట ప్రకారంగా చెల్లించాల్సిన పరిహరాన్ని చెల్లించకపోవడం విచారకరమని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం బాధితురాలికి 8 లక్షల రూపాయాలను ఇవ్వాలని తీర్పును వెలువరించింది.

అర్ధరాత్రి ఒంటరిగా స్త్రీ రోడ్డుపై నిర్భయంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని గాందీ చెప్పిన మాటలను కోర్టు ప్రస్తావించింది.

English summary
madras high court sensational verdict:life sentence for krishna giri gang rape convicts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X