వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2రోజుల్లో రూ.420కోట్లు కట్టాల్సిందే: కాగ్నిజెంట్‌కు మద్రాస్ హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాస్, ముంబైలకు చెందిన కంపెనీ ఖాతాలను ఆదాయపన్ను శాఖ నిలిపివేయడంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాదాపు 68 బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేయడంతో.. తిరిగి వాటిని పునరుద్దరించాలని విన్నవించుకుంది.

కాగ్నిజెంట్‌కు ఐటీ షాక్: బ్యాంకు ఖాతాల నిలిపివేత.. ఎందుకు? కాగ్నిజెంట్‌కు ఐటీ షాక్: బ్యాంకు ఖాతాల నిలిపివేత.. ఎందుకు?

ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బకాయి పడ్డ పన్నులో 15శాతం కట్టాలని ఆదేశించింది. అంటే, దాదాపు రూ.420కోట్లు కాగ్నిజెంట్ ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది కోర్టు.
తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.

Madras high court tells Cognizant to pay Rs 420 crore tax in two days

పన్ను చెల్లింపు కోసం కాగ్నిజెంట్‌కు చెందిన ముంబై-జేపీ మోర్గాన్‌ బ్యాంకు ఖాతాను తిరిగి పునరుద్దరించాలని కోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. కేవలం ఈ ఒక్క ఖాతాకు మాత్రమే మినహాయింపునిచ్చిన కోర్టు.. మిగతా ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని పేర్కొంది.

కాగా, కాగ్నిజెంట్ సంస్థ రూ.2800కోట్లు పన్ను ఎగవతేకు పాల్పడినట్టు ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆరోపణలు చేసింది. 2013-16మధ్య కాలంలో డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని ఆరోపించింది. నోటీసులకు కూడా స్పందించకపోవడంతోనే బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది.

English summary
The Madras high court has ordered Cognizant Technology Solutions, which is embroiled in a Rs 2,800-crore tax dispute with the I-T department, to pay 15% (Rs 420 crore) of the demanded amount in two days. To facilitate the payment, the court ordered unfreezing of the company's bank account with JP Morgan in Mumbai, but its accounts with other banks will remain frozen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X