వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్ధినులకు నిర్మలాదేవి గాలం, మెబైల్స్ నిండా ఆ చిత్రాలే, సంతానం కమిటి విచారణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

నిర్మలాదేవి వ్యవహరంపై మాజీ ఐఎఎస్ అధికారి సంతానం కమిటీ విచారణ

చెన్నై: ప్రోఫెసర్ నిర్మలాదేవి వ్యవహరంపై తమిళనాడు గవర్నర్ నియమించిన మాజీ ఐఎఎస్ అధికారి సంతానం నేతృత్వంలోని కమిటీ విచారణ జరపనుంది. రెండు వారాల్లో ఈ కమిటీ గవర్నర్‌కు నివేదికను అందించనుంది. విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దింపుతున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్ నిర్మలాదేవితో పాటు ఆమె పనిచేసిన కాలేజీలో కూడ ఈ కమిటీ విచారణ జరపనుంది.

అరుపుకోట దేవాంకూర్‌ ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్‌ నిర్మలాదేవి విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దించేదని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. పరీక్షల్లో పాస్ కావడానికి తాను చెప్పినట్టు వినాలని ఆమె విధ్యార్ధినులపై ఒత్తిడి తెచ్చేదని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.

పరీక్షల్లో పాస్ కావడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడ వస్తాయని విద్యార్ధినులను తన వలలో వేసుకొనేదని బాదితులు నిర్మలాదేవి గురించి చెబుతున్నారు. పదేళ్ళుగా ఇదే రకంగా విద్యార్ధినులను నిర్మలాదేవి ఒత్తిడి చేసేదన్నారు.

నిర్మలాదేవి ఎలా వల వేసేందంటే?

నిర్మలాదేవి ఎలా వల వేసేందంటే?

విద్యార్ధులను పరీక్షలు పాస్ చేయిస్తామని ప్రోఫెసర్ నిర్మలాదేవి వల వేసేదని పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. విద్యార్ధినులతో పాటు తాను పనిచేసే కాలేజీలో మహిళా అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను కూడ తన వలలో వేసుకొనే ప్రయత్నం చేసేదని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అయితే ఈ విషయమై కొందరు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో ఆమెను చీవాట్లు పెట్టారు.తరచూ అందమైన విద్యార్థినులు, మహిళా ప్రొఫెసర్లను తన స్వంత ఖర్చులతో కుట్రాలం వంటి పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేదంటున్నారు. ఈ వివరాలన్నీ సీబీసీఐడి విచారణలో వెల్లడయ్యాయని సమాచారం.

మొబైల్ ‌పోన్లలో అశ్లీల చిత్రాలు

మొబైల్ ‌పోన్లలో అశ్లీల చిత్రాలు

ప్రస్తుతం అరుపుకోట మహిళా పోలీసుస్టేషన్‌లో వున్న ప్రొఫెసర్ నిర్మలాదేవి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు సెల్‌ఫోన్లలోనూ వందల సంఖ్యలో అందమైన అమ్మాయిల ఫోటోలు, పలువురు మహిళా ప్రొఫెసర్ల ఫొటోలు, కొన్ని అశ్లీల చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫోటోలను ఆమె ఎందుకు తీసింది. ఎవరెవరి ఫోటోలు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 ప్రోఫెసర్‌తో మాట్లాడిన ఆ నలుగురు ఎవరు

ప్రోఫెసర్‌తో మాట్లాడిన ఆ నలుగురు ఎవరు

ప్రోఫెసర్ నిర్మలాదేవితో మాట్లాడిన నలుగురు విద్యార్ధులెవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు ప్రోఫెసర్‌తో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. అంతకుముందు ఏం జరిగిందనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు. మరోవైపు ఈ నలుగురు విద్యార్ధినులతో కూడ సంతానం కమిటీ విచారణ చేయనుంది. ప్రోఫెసర్‌తో ఎందుకు వారు మాట్లాడారనే విషయమై ఈ కమిటీ ఆరా తీయనుంది.కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులతో కూడ కమిటీ విచారణ చేయనుంది.

ఆ ఇద్దరూ సహకరించారు

ఆ ఇద్దరూ సహకరించారు

నిర్మలాదేవికి అన్ని విధాలా సహకరించిన మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మురుగన్‌, కరుప్పుస్వామి అనే ఇరువురు ఉద్యోగులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మదురై వర్శిటీ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడులు రావటం వల్లే విద్యార్థినులను పడువువృత్తిలోకి నెట్టేందుకు నిర్మలాదేవి సిద్ధమైందని అధ్యాపకులు చెబుతున్నారు.

English summary
Retired IAS officer R Santhanam, who was appointed by governor Banwarilal Purohit to investigate the Madurai Kamaraj University scandal, may question Nirmala Devi, who is now in Madurai prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X