వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ అడ్రస్ ఇదే (ఫోటో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో నిత్యం ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్ని పాకిస్థాన్ లో తలదాచుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చిరునామాతో పాటు అతని పూర్తి వివరాలను భారత నిఘా వర్గాలు (ఇంటిలిజెన్స్) సేకరించాయి.

అతని భార్య పేరుతో ఉన్న టెలిఫోన్ బిల్లుతో సహ నిఘా వర్గాలు ఆధారాలను సేకరించాయి. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచిలో ఉన్నాడని పక్కా ఆధారాలు సేకరించాయి. అంతే కాకుండా దావూద్ ఇబ్రహీం తాజా ఫోటోలు సంపాదించారు.

Mafia Don Dawood Ibrahim lives in Karachi in Pakistan

దావూద్ కు భార్య, ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వెలుగు చూసింది. భార్య మెహజబీన్ షేక్, కొడుకు మెుయిూన్ నవాజ్, కుమార్తెలు మహరుక్, మెహ్రీన్, మాజియాతో కాలిసి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి.

కరాచీ శివార్లలోని క్లిప్ టన్ అనే ప్రాంతంలో ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం నివాసం ఉంటున్నాడు. దావూద్ ఇబ్రహీం కుమారుడు మెుయిూన్ కు సానియా అనే అమ్మాయితో వివాహం అయ్యిందని నిఘా వర్గాల దర్యాప్త్తులో వెలుగు చూసింది.

కుమార్తె మహరూఖ్ కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జూవేద్ మియాందాద్ కొడుకు జునాయిద్ తో వివాహం అయ్యింది. 2015 ఏప్రిల్ నెలలో దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ పేరుతో ఉన్న టెలిఫోన్ బిల్లులు భారత్ నిఘా వర్గాలు సేకరించాయి.

Mafia Don Dawood Ibrahim lives in Karachi in Pakistan

దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఉంటున్న చిరునామా ఇలా ఉంది. ‘‘డి-13, బ్లాక్-4, కారాచీ డెవలప్ మెంట్ అథారిటీ, ఎస్ సీహెచ్-5, క్లిప్టన్, కరాచీ'' అని ఉంది. దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ లో మూడు పాస్ పోర్టులు ఉన్నాయి. అందులో ఒకటి పైన ఉన్న చిరునామా.

మరొ రెండు చిరునామాలు ఈ విధంగా ఉన్నాయి. ‘ 6ఏ, ఖయబాన్ తంజీమ్, ఫేజ్ 5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా', మరొ చిరునామా ‘ మెయిన్ ప్యాలెస్, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా సమీపంలో, క్లిఫ్టన్, కరాచీ ' అని ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

Mafia Don Dawood Ibrahim lives in Karachi in Pakistan

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రదారి అయిన దావూద్ ఇబ్రహీం పేరు మీద ఇంటర్ పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ముంబై వరుస బాంబు పేలుళ్ల లో 257 మంది మరణించారు. దావూద్ తమ దేశంలో లేడని పాక్ పదే పదే పాట పాడింది.

అయితే ఇప్పుడు భారత్ నిఘా వర్గాలు పక్కా ఆదారాలు సేకరించడంతో పాక్ కు నోరు మెదపలేని పరిస్థితి వచ్చింది. ఆదివారం భారత్- పాక్ దేశాల అధికారుల మద్య చర్చలు జరుగుతున్న సందర్బంలో దావూద్ ఇబ్రహీంకు చెందిన ఈ ఆదారాలు బయటపడటంతో పాక్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది.

English summary
The newspaper has published a recent picture of Dawood Ibrahim, 59, and reports that Indian intelligence agencies have documentary evidence that the terrorist, along with his wife and children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X