వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 30 వరకు మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం

|
Google Oneindia TeluguNews

ముంబై: మ్యాగీ నూడుల్స్ నిషేదం ఎత్తి వెయ్యడానికి న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు విచారణ వాయిదా వేశారు. ఈ దెబ్బతో నెస్లె ఇండియా కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. నెస్టె కంపెనీ నిర్వహకులు న్యాయనిపుణలుతో సంప్రదిస్తున్నారు.

చిన్నపిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరం అంటు జాతీయ ఆహార భద్రత సంస్థ దీని మీద నిషేదం విదించింది. ఈ విషయం తెలుసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై నిషేధం విధించారు.

 Maggi ban continue on June 30

దుబాయ్ లో సైతం మ్యాగీ న్యూడుల్స్ మీద నిషేధం విధించారు. మ్యార్కెట్ లలో ఉన్న మ్యాగీ నూడుల్స్ ను తాము వెనక్కి తీసుకుంటున్నామని నెస్లె ఇండియా ప్రకటించింది. ఇదే సందర్బంలో జాతీయ ఆహార భద్రతా సంస్థ విధించిన నిషేధం ఎత్తి వెయ్యాలని బాంబే హై కోర్టులో నెస్లె ఇండియా అర్జీ సమర్పించింది.

శుక్రవారం అర్జీ విచారణ చేసిన బాంబే హై కోర్టు మ్యాగీ నూడుల్స్ మీద నిషేధం ఎత్తి వెయ్యలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ ఈనెల 30వ తేదికి వాయిదా వేశారు. అయితే నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని తెలిసింది.

English summary
The court on Friday issued notice to the Food Safety & Standards Authority of India and other respondents and posted the matter for next hearing June 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X