వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాగీ నిషేధం, ప్లాంట్ మూత: ఉద్యోగి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

నైలితాల్: మ్యాగీ నూడుల్స్ నిషేదించడంతో ఆ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు భార్య, బిడ్డలను పోషించలేక గత 13 రోజుల నుండి నరకం అనుభవించాడు. చివరికి కంపెనీలో ఉద్యోగం రాదని భావించి పైలోకాలకు వెళ్లి పోయాడు.

ఉత్తరాఖండ్ లోని నైనితాల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న రుద్రాపూర్ లో నివాసం ఉంటున్న లల్డా ప్రసాద్ (32) అనే వ్యక్తి సోమవారం ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రుద్రాపూర్ లో స్టేట్ డెవలప్ మెంట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో మ్యాగీ ప్లాంట్ ఉంది.

 Maggi ban: Nestle contract worker commits suicide in Uttarakhand

ఈ మ్యాగీ ప్లాంట్ లో 1,100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి ప్రసాద్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మ్యాగీ నూడుల్స్ స్యాంపిల్స్ పరిశీలించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాటిని నిషేధించింది.

మ్యాగీ నూడుల్స్ పరిశీలించి నివేదిక సమర్పించాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసి ఈ నెల 20వ తేదికి కేసు విచారణ వాయిదా వేసింది. ఈ సందర్బంలో రుద్రాపూర్ లోని మ్యాగీ ప్లాంట్ మూత పడింది. గత 13 రోజుల నుండి కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారు.

భార్య, బిడ్దలను పోషించడం కష్టం కావడంతో ప్రసాద్ దిగులు చెందాడు. సోమవారం అతని భార్య ఉద్యోగానికి వెళ్లిన తరువాత ప్రసాద్ ఫ్యాన్ కు ఉరి వేసుని ఆత్మహత్య చేసుకున్నాడని యుఎస్ నగర్ జిల్లా ఎస్పీ ఎన్ఎ. భర్నే తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

English summary
A contract worker working at Nestle India in Uttarakhand's Rudrapur committed suicide 13 days after the state high court banned sale and production of the company's popular instant noodles brand Maggi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X