వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: అయిదు రోజులే డ్యూటీ..అక్కడే ట్విస్ట్: కేబినెట్ భేటీలో..!

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్దేశించింది. శని, ఆదివారాల్లో సెలవును ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని రానుంది. అక్కడే ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. పని వేళలను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఒక అదనంగా పని చేయాల్సి ఉంటుందంటూ ఉత్తర్వులను జారీ చేయవచ్చని సమాచారం.

మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలుమీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలు

ఈ మేరకు మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో అయిదు రోజుల పనిని కల్పించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. మహారాష్ట్రలో సుమారు 20 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేసినట్లు మహారాష్ట్ర సమాచార శాఖ మంత్రి తెలిపారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Trump India Tour | LPG Prices Hiked
Maha govt employees to have 5-day working in a week

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మంత్రివర్గం ఈ ఉదయం సచివాలయంలో సమావేశమైంది. పలు కీలక అంశాలపై చర్చించింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (ఎస్ఈబీసీ), విముక్తి జాతి, నొమడిక్ ట్రైబ్స్ (వీజేఎన్‌టీ), ప్రత్యేక వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలను బహుజన కల్యాణ డిపార్ట‌మెంట్‌గా పరిగణించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

English summary
The Maharashtra government on Wednesday announced five-day working week for its officers and employees from 29 February. The decision was taken at the state Cabinet meeting chaired by Chief Minister Uddhav Thackeray here. There are over 20 lakh officers and employees in government, semi-government and local bodies in the state. The Cabinet also decided that the state department for OBCs, SEBCs (socially and educationally backward classes), VJNTs (vimukt jati and nomadic tribes) and special backward classes will now be known as the 'Bahujan Kalyan Department'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X