వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా రాజకీయం... ట్విస్టులు... రికార్డులు... నూతన రాజకీయ ముఖచిత్రం

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రాలో జరిగిన అనేక పరిణామాల మధ్య పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువు దీరింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నెల రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న శివసేన నాయకుడే... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం ఎంత ఉత్కంఠను కొనసాగించిందో ...అందుకు సంబంధించిన పరిణామాలు కూడ మహారాష్ట్రలో మరిన్ని రికార్డులను సృష్టించాయి.

ఎమ్మెల్యే కాకుండానే సీఎం అయిన ఉద్దవ్ ఠాక్రే

ఎమ్మెల్యే కాకుండానే సీఎం అయిన ఉద్దవ్ ఠాక్రే

బీజేపీ ,శివసేనల మధ్య విభేదాలతోపాటు శివసేన పట్టుదలతో మహారాష్ట్రాలో రాజకీయా ముఖచిత్రమే మారిపోయింది....బద్ద శత్రువులుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో భవిష్యత్ రాజకీయాల్లో కొత్త కొణాలకు తెరదీశారు. సిద్దాంతపరంగా విరుద్ద భావాలు ఉన్న పార్టీలు ఒక్కటై అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అది కూడ శివసేనకు బ్యాక్‌బోన్‌గా ఉన్న ఉద్దవ్ థాక్రే , ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వార ఎన్నికగాని నేత , పార్టీ పరమైన పదవులనే చేపట్టి, ఏకంగా సీఎం పదవిని వరించిన ఘనత ఉద్దవ్ థాక్రేదని చెప్పవచ్చు.

సభానాయకుడు లేకుండా ఎమ్మెల్యేల ప్రమాణం

సభానాయకుడు లేకుండా ఎమ్మెల్యేల ప్రమాణం

ఇక కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర అసెంబ్లీలో మరో ముఖ్యమైన ఘట్టం కూడ రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. కోర్టు అదేశాలతో హుటాహుటిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరిగింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశానికి ముందు సభానాయకుడుని ఎన్నుకుని ,ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరమే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. కాని మహారాష్ట్రాలో జరిగిన పరిణామాలు అందుకు విరుద్దంగా కొనసాగాయి. ముందుగానే ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

మహాలో ఎమ్మెల్యేలు గాని సీఎంలు వీరే

మహాలో ఎమ్మెల్యేలు గాని సీఎంలు వీరే

అయితే మహారాష్ట్రా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటీ సంఘటనలు కొత్తవేమి కాకపోయినా...రెండు దశాబ్దాల క్రితం ఇలాంటీ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసన సభకు గానీ, శాసన మండలికి గానీ ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు కూడ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం ఆ జాబితాలో తాజాగా ఉద్ధవ్ థాకరే కూడా చేరిపోయారు. మొత్తం ఎనిమిది మంది ఏ సభలో సభ్యులు కాని వారు ఉద్దవ్ థాక్రే కంటే ముందు ఏఆర్ అంతులే, వసంత్ దాదా పాటిల్, శివాజీరావు నిలంగేకర్ పాటిల్, శంకర్ రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, శరద్ పవార్..కూడ ఉన్నారు.

English summary
Uddhav Thackeray was sworn in as Maharashtra's new Chief Minister this evening at the Shivaji Park in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X