వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామాయణ, మహాభారతాలు రెండు.. హింసతో నిండి ఉన్నాయి ! ఏచూరి వివాదాస్పద వ్యాఖ్యలు !

|
Google Oneindia TeluguNews

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వివాదస్పద వ్యాఖ్యలకు వేదికయ్యారు. హిందువులు హింసావాదులని, మహభారతం ,రామాయణాలు సైతం హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే హిందువులు హింసావాదులు అని అన్నారు. ఇతర మతాల్లో హింసాకు పాల్పడేవారు ఉన్నారని చెబుతున్న వాళ్లు హిందు మతంలో హింసావాదులు లేరని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. బోపాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాపై సైతం విరుచుకుపడ్డారు.

హిందు పురాణాలు హింసతో నిండి ఉన్నాయి..

హిందు పురాణాలు హింసతో నిండి ఉన్నాయి..

మధ్యప్రదేశ్ బోపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సీతారం ఏచూరి పలు వివాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణ ,మహభారతం లు రెండు కూడ యుద్దాలతోపాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని పేర్కోన్నారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఇతర మతాల్లో హింసను ప్రేరేపించే వాళ్లు ఉన్నారని చెబుతున్న హిందుప్రచారకులు తమ మతంలో మాత్రం లేరని చెబుతున్నారని అన్నారు.

హిందువుల ఓట్లు రాబట్టుకునేందకే సాధ్వీ ప్రగ్యాను రంగంలోకి దింపారు

హిందువుల ఓట్లు రాబట్టుకునేందకే సాధ్వీ ప్రగ్యాను రంగంలోకి దింపారు

అంతకు ముందు మాట్లాడుతూ బోపాల్ లోక్‌సభ స్థానం నుండి ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న ప్రజ్ఝా ఠాగూర్ హిందువులు హింసను నమ్మరని చెప్పారని కాని రామాయణ ,మహాభారతం లాంటీ పురాణాల్లో హింస కూడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కోన్నారు. మరోవైపు హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపిందని అన్నారు. కాగా హిందుత్వా అనేది ఒక రాజకీయ ఎజెండా అని అన్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే హిందుత్వ ఎజెండాను తీసుకుని ప్రజలను రెచ్చ గొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

మౌర్యులు కళింగ యుద్దం తర్వాత హింసను వీడారు

మౌర్యులు కళింగ యుద్దం తర్వాత హింసను వీడారు

కాగా ఇదే విషయంపై చరిత్రలోని పలు అంశాలను ఆయన పేర్కోన్నారు. కళింగ యుద్దం తర్వాత మౌర్య చక్రవర్తులు హింసను వదలి బుద్దిజాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఈనేపథ్యంలోనే ఆశోకుడు చెప్పిన వ్యాఖ్యలు ఆయన గుర్తు చేశారు. రాజ్యంలో ఎవరైన ఇతర మతాలపై దాడులు చేస్తే వాళ్ల స్వంత కమ్యునిటి ని ప్రమాదంలోకి పడేసినవారు అవుతారని అన్నారని చెప్పారు. ఇలాంటీ సంప్రాదాయం హిందువులకు ఉందని కాని బీజేపీ చెబుతున్న హిందుత్వం వేరని అన్నారు.

సీతారాం ఏచూరి పేరులోని సీతారాం ను మార్చుకోవాలి ,శివసేన

సీతారాం ఏచూరి పేరులోని సీతారాం ను మార్చుకోవాలి ,శివసేన

సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలు అతని స్వంత భావజాలం అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. అవి కేవలం హిందువులపై దాడి చేయడానికే అని అన్నారు. రామాయణం మరియు మహాభారతం లు మంచిపై చెడును సాధించే సందేశాన్ని ఇచ్చాయని అన్నారు. ఇక రాముడు, క్రిష్ణుడు, మరియు అర్జునుడు నీతీకి నిదర్శనమని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీతారాం ఏచూరి తన పేరులో ఉన్న సీతారాం ను మార్చుకోవాలని ఆయన సూచించారు.

English summary
CPIM general secretary Sitaram Yechury has stoked a controversy saying even Ramayana and Mahabharata are filled with instances of violence and there is no logic in saying that Hindus are non-violent
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X