వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లూ వేల్ తరహాలో మరో మహామ్మారి.. ప్రాణాలు తీస్తుంది జర భద్రం..!

|
Google Oneindia TeluguNews

పుణె : ఆన్‌లైన్ ఆటలు ప్రాణాలు తీస్తోంది. బ్లూ వేల్, పబ్జీ గేమ్స్ ఆడుతూ యువత ప్రాణాలు తీసుకుంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కామర్స్ చదవుతున్న యువకుడు ఆన్‌లైన్ ఆటల ప్రభావంతో బలవన్మరణం చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు గద్గత స్వరంతో రోదిస్తున్నారు. తమకు పట్టిన గతి మరెవరికి పట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రాణం తీసిన ఆట
మహారాష్ట్రలోని లోనికాండ్‌కు చెందిన దివాకర్ కామర్స్ చదువుతున్నారు. కానీ ఇటీవల ఆయన ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయ్యారు. ఇంకేముందు 24 గంటలు గేమ్‌లో తలమునకలయ్యారు. అందులో చెప్పినట్టు నిమగ్నమయ్యారు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అనే ట్యాగ్‌లైన్‌తో అతడిని గేమ్ ప్రభావితం చేసింది. దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఛాలెంజ్‌కు సంబంధించి తన సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. ఆ నోట్ ఇంగ్లీష్ ఆన్‌లైన్ గేమ్ ఛాలెంజ్‌లో పాల్గొని .. తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చారు.

Maharashtra: 20-year-old man hangs self as part of online game task

మలి సూసైడ్‌తో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడు బ్లూ వేల్ లాంటి ఆన్‌లైన్ గేమ్‌లో లీనమయ్యాడని వాపోయారు. ఆన్‌లైన్ గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తన కుమారుడు చనిపోవడానికి కారణం మొబైల్ ఫోన్ అని అతని తల్లి తెలిపారు. తాను కొడుకును కోల్పోయానని .. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తన లాగా పుత్రశోకం వద్దని, ముందే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. బ్లూ వేల్ ఆటలో ప్లేయర్లు టాస్క్ ఫూర్తిచేయాలని కోరతారు. ఆ టాస్క్‌లో చివరిది సూసైడ్ చేసుకోవాలని కోరతారు. ఆటలో లీనమైన వారు.. టాస్క్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ..తాము సూసైడ్ చేసుకుంటామనే విషయాన్ని కూడా మరచిపోయి పూర్తిచేస్తారు.

English summary
a 20-year-old man allegedly hanged himself in Pune in Maharashtra while trying to complete a task in a Blue Whale-like online game, police said Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X