వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం : కుప్పకూలిన భవనం... 10 మంది మృతి,శిథిలాల కింద 25 మంది..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని భీవండీలో విషాదం చోటు చేసుకుంది. పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 20-25 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. సోమవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు థానే మున్సిపల్ కార్పోరేషన్ పీఆర్వో వెల్లడించారు.

కుప్పకూలిన జిలానీ అపార్టమెంటును 1984లో నిర్మించగా... ఇందులో మొత్తం 69 ఫ్లాట్స్ ఉన్నాయి. అంతా నిద్రలో ఉన్నవేళ ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఢీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిలో ఇప్పటివరకూ ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించినట్లు తెలుస్తోంది.

Maharashtra: 8 dead as building collapses in Bhiwandi, many feared trapped

భీవండి మున్సిపల్ కమిషనర్ డా.పంకజ్ అసియా మాట్లాడుతూ... కుప్పకూలిన జిలానీ అపార్ట్‌మెంట్ 30 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్పారు. భవనానికి మరమ్మత్తులు చేయించాల్సిందిగా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

తాజా ఘటనతో భీవండి పరిధిలోని పాత భవనాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు భావిస్తున్నారు.

Recommended Video

Mumbai ని ముంచెత్తుతున్న వర్షాలు..!! | రెడ్ అలెర్ట్ || Oneindia Telugu

కాగా, అగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోనూ ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. దాదాపు 75 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోగా 60 మందిని రక్షించారు.మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

English summary
At least eight people have died and many are feared trapped after a three-storeyed building collapsed in Bhiwandi city of Maharashtra’s Thane, said Thane Municipal Corporation PRO on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X