వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లెట్ ట్రైన్ వద్దు.. రైతులే ముద్దు... రూ.27 వేల కోట్లు, కేటాయించేందుకు మహాకూటమి మొగ్గు...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారం చేపట్టబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై రెండు, మూడురోజుల్లో క్లారిటీ రానున్నది. అయితే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) మేరకు రైతు ప్రయోజనాలకు పెద్ద పీట వేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం బుల్లెట్ ట్రైన్‌కు కేటాయించే నిధులను రైతుల కోసం ఉపయోగిస్తామనే ఇండికేషన్స్ ఇచ్చాయి. దీంతో మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

మహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తిమహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తి

 బుల్లెట్ రైలు వద్దు..

బుల్లెట్ రైలు వద్దు..

ముంబై-అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ కోసం ప్రణాళిక రచించారు. జపాన్ ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుండగా.. కొత్తగా ఏర్పడబోయే సర్కార్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చింది. తమకు బుల్లెట్ ట్రైన్ వద్దని చెబుతోంది. ప్రాజెక్టు తొలి నుంచి వద్దని ఈ పార్టీలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి.

నిధుల మళ్లింపు..?

నిధుల మళ్లింపు..?

రాష్ట్రంలో అధికారం చేపట్టనుండటం.. కనీస ఉమ్మడి ప్రణాళిక మేరకు రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని చెబుతుంది. ఈ మేరకు బుల్లెట్ ట్రైన్ నిధులను రైతుల కోసం మళ్లిస్తామని క్లారిటీ ఇచ్చాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం రూ.1.08 లక్షల కోట్లు వ్యయమవుతాయి. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం.. అంటే రూ.27 వేల కోట్లు కేటాయించాలి. ఆ నిధులను తాము రైతుల కోసం మళ్లిస్తామని కూటమి సంకేతాలు ఇస్తోంది.

రైతులే మిన్న

రైతులే మిన్న

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. దానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాల్సి ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ కన్నా.. రైతుల ప్రయోజనాలు ముఖ్యమని కూటమి భావిస్తోంది. రూ.27 వేల కోట్లను రైతులకు పంట పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర, రుణమాఫీ తదితర అంశాల కోసం వ్యయం చేయాలని శివసేన కూటమి భావిస్తోంది. ఈ మేరకు సీఎంపీలో చేర్చారని.. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 మూడు మూడురోజుల్లో..రోజుల్లో..

మూడు మూడురోజుల్లో..రోజుల్లో..

మహారాష్ట్రలో రెండు, మూడురోజుల్లో శివసేన ప్రభుత్వం కొలువుదీరబోతుంది. కూటమికి మద్దతిస్తామని సోనియాగాంధీ ప్రకటించడంతో కనీస ఉమ్మడి ప్రణాళికపై ఫోకస్ చేశారు. బ్లూ ప్రింట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ రూపొందించారు. దీనిపై బుధవారం సుదీర్ఘ చర్చ తర్వాత కార్యరూపం దాల్చినట్టు తెలుస్తోంది. ఆయా అంశాలను అధినేతలు మరోసారి చర్చించి.. పదవుల పంపకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మూడురోజుల్లో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
three parties working to form a government in Maharashtra plan to give money meant for investment in a bullet train project to farmers instead, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X