వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

exit poll: మహారాష్ట్ర-హర్యానా బీజేపీవే, ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పిందంటే? మహాలో మజ్లిస్‌కు 1 సీటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు వరుసలో నిలిచిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోను ఓటింగ్ శాతం తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు జోరుగా ప్రచారం చేశాయి. మహారాష్ట్ర, హర్యానాలో 4,406 మందికి వరకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

News18-IPSOS exit poll: 243 సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్, హర్యానా కమలమయంNews18-IPSOS exit poll: 243 సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్, హర్యానా కమలమయం

ఎన్నికలు పూర్తవగానే వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఫలితాల్లోను బీజేపీ లేదా బీజేపీ కూటమిదే హవా అని తేలింది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి, హర్యానాలో బంపర్ మెజార్టీతో కమలదళం ఒంటరిగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. మోడీ హవా తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.

maharashtra and haryana election exit poll results

ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు... మహారాష్ట్ర

ABP-C ఓటరు: మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమి 204 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ (+) కూటమి 69 సీట్లు గెలుచుకుంటుంది.

టైమ్స్ నౌ: మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమి 230 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ (+) కూటమి 48 సీట్లు, ఇతరులు 10 స్థానాలు గెలుచుకుంటారు.

ఇండియా టుడే-యాక్సిస్: మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమి 166-194 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ (+) కూటమి 72-90 సీట్లు గెలుచుకుంటాయి.

News18-IPSOS:మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమిగా పోటీ చేసిన బీజేపీకి 141, శివసేనకు 102 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 17, ఎన్సీపీకి 22 సీట్లు వస్తాయని తేలింది. మజ్లిస్ పార్టీ 1 సీటు గెలుచుకోనుంది. అంటే బీజేపీ కూటమికి 243 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 41 సీట్లు రానున్నాయి.

REPUBLIC-JAN KI BAAT: మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమి 2016-230 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ (+) కూటమి 50-69 సీట్లు గెలుచుకుంటుంది.

TV9-CICERO: మహారాష్ట్రలోని 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన(+) కూటమి 197 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ (+) కూటమి 75 సీట్లు గెలుచుకుంటాయి.

ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు... హర్యానా

News18-IPSOS: హర్యానాలో 90 స్థానాలకు గాను బీజేపీ 75 సీట్లు, కాంగ్రెస్ 10 సీట్లు, జేజేపీ 02 సీట్లు గెలుచుకోనున్నాయి.

ABP-C ఓటరు: హర్యానాలో 90 స్థానాలకు గాను బీజేపీ 72 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు, జేజేపీ 10 సీట్లు గెలుచుకోనున్నాయి.

REPUBLIC-JAN KI BAAT: హర్యానాలో 90 స్థానాలకు గాను బీజేపీ 52-63 సీట్లు, కాంగ్రెస్ 15-19 సీట్లు, జేజేపీ 12-19 సీట్లు గెలుచుకోనున్నాయి.

TV9-CICERO: హర్యానాలో 90 స్థానాలకు గాను బీజేపీ 69 సీట్లు, కాంగ్రెస్ 11 సీట్లు, జేజేపీ 10 సీట్లు గెలుచుకోనున్నాయి.

మహారాష్ట్రలో 288 స్థానాలు.. కీలక నేతలు

మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మేజిక్ ఫిగర్ 145. ఇక్కడ బిజేపీ, మిత్రపక్షాలు కలిసి 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మరో మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 147, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన 101 స్థానాల్లో బరిలోకి దిగింది.

ప్రముఖుల్లో ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ నైరుతీ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ బోకార్ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కారాడ్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే శివసేన నుంచి వర్లి నుంచి పోటీలో ఉన్నారు.

హర్యానాలో సీట్లు, కీలక నేతలు

హర్యానాలో 90 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 46. బీజేపీ, కాంగ్రెస్‌లు 90 స్థానాల్లో పోటీ పడుతుండగా, బీఎస్పీ 87 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తోంది. బరిలో ఉన్న ప్రముఖుల్లో బీజేపీ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హి శాంప్లా-కిలోయి నుంచి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఖైతాల్ నుంచి, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ నుంచి, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింక్ చౌతాలా ఎల్లెనాబాద్ నుంచి బరిలో ఉన్నారు.

English summary
Exit Poll Results 2019: News18 and Ipsos, the team that predicted a big victory for the BJP in the General Election in May this year, is teaming up again. This time to project the Maharahsra and Haryana Assembly Elections Exit Poll Result based on an exclusive exit poll survey. Voting for the two new assemblies has just concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X