• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీ స్పీకర్‌‌కు జాక్‌పాట్ -పార్టీ పగ్గాలతోపాటు మంత్రి పదవి -మోదీని తిట్టాక లక్కు కలిసొచ్చిందిలా..

|

ఎన్ని పార్టీలు మారామన్నది కాదన్నయ్యా.. సరైన టైములో జంపు కొట్టామా, లేదా అన్నదే రాజకీయాల్లో లెక్క. అలాంటి లెక్కల్లో కూడా అతి కొద్ది మందినే లక్కు వరిస్తుంది. ఆ విధంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే ఏకంగా డబుల్ జాక్ పాట్ కొట్టేసినట్లే లెక్క. బహుశా, గడిచిన దశాబ్ద కాలంలో మోదీని తిట్టి బాగుపడ్డ నేత కూడా ఆయనే కావొచ్చు. పేరుకు రాజ్యాంగ పదవే అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో స్పీకర్ స్థానంలో కూర్చున్న నేతలు.. తమకు మంత్రిగిరీ ఇష్టమని బాహాటంగా చెప్పుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

మరుపురాని ప్రయాణం మళ్లొచ్చె -హైదరాబాద్‌లో 25 డ‌బుల్ డెక్క‌ర్ బస్సులు -రూట్లివే -ముహుర్తం ఎప్పుడంటే

స్పీకర్ పదవికి రాజీనామా..

స్పీకర్ పదవికి రాజీనామా..

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ నానా పటోలే గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో నిరాడంబరంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు పటోలే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి ఎంపిక కావడంతోపాటు త్వరలో మంత్రి పదవి కూడా చేపట్టనున్న కారణంగా స్పీకర్ పదవిని వదులుకున్నారాయన. ఈ తంతుకు మిత్రపక్షాలు కూడా అంగీకారం తెలపడంతో ప్రక్రియ సజావుగా సాగుతోంది..

పీసీసీ పగ్గాలు.. మంత్రి పదవి కూడా

పీసీసీ పగ్గాలు.. మంత్రి పదవి కూడా

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన కుంబీ సామాజిక వర్గ నేత నానా పటోలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి, గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునే వ్యూహంలో భాగంగా బలమైన నాయకుడిగా పేరున్న నానా పటోలేను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసింది. అంతేకాదు, శివసేన నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ మిత్రులుగా ఉన్న మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగానూ పటోలేకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా సమర్పించారు.

 మోడీని తిట్టి బహిష్కరణకు గురై..

మోడీని తిట్టి బహిష్కరణకు గురై..

ప్రస్తుతం మహారాష్ట్ర పీసీపీ చీఫ్ గా ఉన్న బాలా సాహెబ్ థోరాట్ కూడా ఉద్ధవ్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. థోరాట్ వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోయే నానా పటోలేకు కూడా మంత్రి పదవి దక్కనుండటం విశేషం. కాంగ్రెస్‌లోనే పొలిటికల్ కెరీర్ ఆరంభించిన పటోలే.. పార్టీతో విభేదించి, బీజేపీలో చేరిపోయి, 2014లో భండయా-గోండియా లోక్‌సభ సభ్యుడిగా కమలం గుర్తుపై గెలుపొందారు. అయితే, ఎంపీగా తొలి టర్మ్ చివరి రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రస్థాయిలో విమర్శించడంతో పటోలేను బీజేపీ బహిష్కరించింది. దాంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికై మహా వికాస్‌ అఘాడి (శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్) ప్రభుత్వం ఏర్పడగా నానా పటోలే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు స్పీకర్ పదవి నుంచి ఏకంగా మంత్రి, పార్టీ సారధిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సెంటిమెంట్ కానప్పటికీ, నరేంద్ర మోదీని విపరీతంగా తిట్టిపోసిన నేతలెవరూ తర్వాతి కాలంలో పెద్దగా రాణించిన సందర్భాలు గడిచిన ఏడేళ్లలో అరుదనే చెప్పాలి.

రిహానా ట్వీట్ కంటే మోదీ తీరే డేంజర్ -నిరసనే ప్రజాస్వామ్యానికి జీవనాడి -రాజ్యసభలో సంచలన స్పీచ్

English summary
Maharashtra Assembly Speaker Nana Patole on Thursday stepped down from his post, handing over his resignation letter to Deputy Speaker Narhari Zirwal. Patole is likely to be the next Maharashtra Congress chief. Patole, the MLA from Sakoli in Bhandara district, is likely to replace revenue minister Balasaheb Thorat as state Congress president soon, according to party sources. The Congress shares power with the Shiv Sena and Nationalist Congress Party in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X