• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!

|

మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చేరుకుంది. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి . ఇక మరణాలు భయంకరంగా పెరిగి ప్రజలను వణికిస్తున్నాయి .

 మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం .. పెరుగుతున్న మరణాలతో దయనీయ స్థితి

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం .. పెరుగుతున్న మరణాలతో దయనీయ స్థితి

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది. కరోనా విలయతాండవం కొనసాగుతోంది . హృదయవిదారకమైన దృశ్యాలు మహారాష్ట్రలో ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయి. అత్యంత దయనీయంగా మహారాష్ట్రలో కరోనా పరిస్థితి మారింది. కరోనా మహమ్మారి కి బలైపోయిన వారి అంతిమ సంస్కారాలు చేయడం పలు ప్రాంతాలలో పెద్ద ఇబ్బందిగా పరిణమిస్తుంది .

బీడ్ జిల్లా అంబజోగై పట్టణంలోని స్మశాన వాటికలో కరోనా బారినపడి మృతి చెందినవారి మృతదేహాలను దహనం చేయడానికి స్థానికులు అంగీకరించలేదు .

అంబజోగై స్మశానంలో కరోనా మృతదేహాల దహనాన్ని అడ్డుకున్న స్థానికులు

అంబజోగై స్మశానంలో కరోనా మృతదేహాల దహనాన్ని అడ్డుకున్న స్థానికులు

వారి అంతిమ సంస్కారాలు ఆ స్మశానవాటికలో నిర్వహించకూడదని అక్కడి నిర్వాసితులు ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నారు. అక్కడ స్మశానంలో మృతదేహాల దహన సంస్కారాలను చేయడాన్ని వ్యతిరేకించారు. కరోనా బారిన పడిన వారిని దహనం చేయడం వల్ల, చుట్టుపక్కల ఉన్న వారు కూడా వ్యాధిగ్రస్తులు అవుతారంటూ వారు అభిప్రాయపడ్డారు.

దీంతో పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోని మాండవా రోడ్డులో మరో స్థలంలో మృతులకు దహన సంస్కారాలను నిర్వహించవలసి వచ్చింది.

వేరే స్థలంలో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు దహన సంస్కారాలు

వేరే స్థలంలో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు దహన సంస్కారాలు

అక్కడ శ్మశానవాటికలో స్థలం కొరత కారణంగా కరోనా బాధితుల ఎనిమిది మృతదేహాలను ఒక చితిపై దహనం చేశారు. ఇక ఇదే విషయాన్ని అంబజోగై మునిసిపల్ కౌన్సిల్ యొక్క చీఫ్ ఆఫీసర్ అశోక్ సబలే తెలిపారు. కొత్త తాత్కాలిక స్మశాన వాటికలో పరిమిత స్థలం ఉందని ఆయన అన్నారు. అందువల్ల పెద్ద చితిని ఏర్పాటు చేసి ఎనిమిది మంది మృతదేహాలను ఒకే చితిపై ఉంచి దహనం చేశామని ఆయన తెలిపారు. ఇక ఈ దారుణ స్థితి అక్కడ కరోనా పరిస్థితికి అద్దం పడుతుంది.

కేసులు పెరుగుతున్న కారణంగా మహారాష్ట్రలో మౌలిక వసతుల లేమి

కేసులు పెరుగుతున్న కారణంగా మహారాష్ట్రలో మౌలిక వసతుల లేమి

కరోనా కేసులు పెరుగుతున్నందున మరియు ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున, వారు తాత్కాలిక సదుపాయాన్ని విస్తరించి, వర్షాకాలం ముందు నీరు నిల్వ లేకుండా మార్చాలని చూస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వెంటనే ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే

ప్రాణాలు కాపాడవచ్చు అని పేర్కొన్నారు. ఇక ఆస్పత్రులలోనూ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే పలు చోట్ల లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూలు విధిస్తూ , కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనా కట్టడి యత్నం చేస్తున్నారు .

 బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 59,907 కొత్త కేసులు, 322 మరణాలు

బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 59,907 కొత్త కేసులు, 322 మరణాలు

భారతదేశంలోని మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 59,907 కొత్త కేసులు నమోదు కాగా కరోనా కారణంగా 322 మంది మరణించారు. ప్రస్తుత మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31, 73, 261 కి పెరిగింది. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 56, 652 కు చేరుకుంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మహారాష్ట్రలో ప్రస్తుతం 5,01,559 యాక్టివ్ కేసులున్నాయి.

English summary
Eight bodies of COVID-19 victims were cremated on one pyre due to a shortage of space at a makeshift crematorium in Maharashtra's Beed district. Since residents had opposed the cremation of bodies of COVID-19 patients at crematoriums in Ambajogai town, localauthorities had to identify another place away from there to perform the victims' last rites and space where there was limited .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X