వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40 వేల మార్క్ దాటిన మహారాష్ట్ర, ముంబైలోనే 25 వేలు, వరసగా ఐదోరోజు 2 వేల కేసులు నమోదు..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం కూడా 2 వేల మార్క్ దాటింది. 2345 పాజిటివ్ కేసులతో రెండో అత్యధిక కేసులు నమోదైన రోజుగా రికార్డు సృష్టించింది. ఈ నెల 17వ తేదీన 2347 పాజిటివ్ కేసులో ప్రథమ స్థానంలో ఉంది. గురువారం కూడా 2 వేల పైచిలుకు కేసులు నమోదవడం వరుసగా ఐదోరోజు. గత 5 రోజుల్లోనే 10 వేల పాజిటివ్ కేసులు రికార్డవడం మరాట్వాడాలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 41 వేల 642కి చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో 50 వేల మార్క్‌ను ఈజీగా అందుకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలుతెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు

64 మంది మృతి..

64 మంది మృతి..

గురువారం ఒక్కరోజే 64 మంది చనిపోయారు. వీరిలో 41 మంది ముంబైలో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మలేగావ్‌లో 9, పుణెలో 7, ఔరంగాబాద్‌లో 3, నవీ ముంబైలో ఇద్దరు, పింప్రీ చించ్ వాడీ, షోలాపూర్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 1454కి చేరింది. గురువారం 1408 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ తగ్గి ఇంటికి చేరుకున్న వారి సంఖ్య 11 వేల 726కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేల మార్క్ చేరింది. గురువారం 1382 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా 882గా ఉంది. ముంబై మహానగరంతో కలిపి థానే లెక్క తీస్తే వైరస్ సోకిన వారి సంఖ్య 31 వేల 851 కాగా, చనిపోయిన వారి సంఖ్య 993గా ఉంది అని అధికారులు చెబుతున్నారు.

ముంబై తర్వాత పుణె..

ముంబై తర్వాత పుణె..

ముంబై తర్వాత వైరస్ ప్రభావం పుణెలో ఎక్కువగా ఉంది. డివిజన్‌లో వైరస్ సోకిన వారి సంఖ్య 5 వేల 371 కాగా.. ఇప్పటివరకు 264 మంది చనిపోయారు. నాసిక్‌లో 1425 పాజిటివ్ కేసులతో 94 మంది చనిపోయారు. కోల్హాపూర్‌లో 357 పాజిటివ్ కేసులు కాగా.. ఐదుగురు చనిపోయారు. ఔరంగాబాద్‌లో 1297 మందికి వైరస్ సోకింది. ఇప్పటికే 40 మంది చనిపోయారు. లాథూర్‌లో 178 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆరుగురు చనిపోయారు.

Recommended Video

Sonu Sood Arranges Buses For Migrants Stuck In Mumbai
 వైరస్ ప్రబలిన ప్రాంతాలివే..

వైరస్ ప్రబలిన ప్రాంతాలివే..

ఆకొలాలో 641 మందికి పాజిటివ్ సోకగా.. 34 మంది చనిపోయారు. నాగ్‌పూర్‌లో 474 మందికి వైరస్ సోకగా.. ఏడుగురు చనిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 48 మందికి మహారాష్ట్రలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో 1949 కంటెన్మైంట్ జోన్లలో 15 వేల 949 మంది ఆరోగ్య కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. 64.89 లక్షల మందిని పరీక్షించారు. 4.37 లక్షల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచామని.. 26 వేల 895 మంది ఇతర చోట్ల క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

English summary
Maharashtra registered as many as 2,345 new coronavirus cases in the last 24 hours, taking the COVID-19 tally in the state to 41,642, health officials said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X