వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజ్ఞాసింగ్ ‌కు బెదిరింపు లేఖ.. అరెస్ట్, వృత్తి ఆయుర్వేద వైద్యం, ప్రవృత్తి ఉగ్రవాదులతో సంబంధాలు...

|
Google Oneindia TeluguNews

భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను బెదిరింపు లేఖ కేసును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌లో గల నాందేడ్‌ గ్రామంలో ఆయుర్వే డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఒక ఎన్వెలాప్‌లో రసాయనంతో రెహ్మన్ పంపించారు. ఆ రసాయనం కాలే స్వభావం ఉందని గుర్తించారు. వెంటనే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యాంటి టెర్రర్ స్వ్కాడ్ రంగంలోకి దిగింది.

ఎన్వెలాప్‌లో రసాయనం..

ఎన్వెలాప్‌లో రసాయనం..

నాందేడ్‌ గ్రామంలో ఆయుర్వేద క్లినిక్ నిర్వహిస్తోన్న రెహ్మన్ ఎన్వెలాప్ పంపించారని గుర్తించారు. ఆ ఎన్వెలాప్‌లో ‘అన్సారుల్ ముస్లిమిన్' ఉగ్రవాద సంస్థ పేరు ఉంది. ముంబైలో మారణహోమం, లేదంటే పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులు జరిపినట్టు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను అంతమొందించాలని ఉగ్రవాద సంస్థ ప్రణాళిక రచించింది. దీనిపై వెంటనే కమ్‌లానగర్ పోలీసులకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన లేఖ ఉర్దూలో ఉందని, తనపై హతమార్చేందుకు లేఖ పంపించారని కంప్లైంట్ చేశారు.

 రెహ్మన్ సోదరుడు..

రెహ్మన్ సోదరుడు..

ఆ లేఖలో రెహ్మన్ ఖాన్ సోదరుడు పుణెకి చెందిన ఒకరికి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను హత్య చేయాలని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే తన సోదరుడి పేరును రెహ్మన్ ఖాన్ కావాలనే చేర్చినట్టు సమాచారం. తన సోదరుడు, తల్లితో ఆయనకు ఆస్తికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై రెహ్మన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

3 నెలలుగా..

3 నెలలుగా..

మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్ సయ్యద్ అబ్దుల్ రెహ్మన్ ఖాన్ ఆచూకీ కనుకొనేందుకు 3 నెలలుగా ప్రయత్నిస్తోందని ముంబైకి చెందిన పోలీసు అధికారి ప్రదీప్ కాకడే తెలిపారు. అయితే తన సోదరుడు, తల్లికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులకు రెహ్మన్ ఖాన్ లేఖ రాశాడని పేర్కొన్నారు. రెహ్మన్ ఖాన్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు మొబైల్ లొకేషన్ కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే రెహ్మన్ ఖాన్ తెలివిగా వ్యవహరించి తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలిపెట్టి.. ఔరంగాబాద్, నాగ్‌పూర్ ఇతర నగరాల నుంచి లేఖలను పోస్ట్ చేశారని పేర్కొన్నారు. చివరికి గాలించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

English summary
bjp mp Pragya Singh Thakur, bhopal Pragya Singh Thakur news, Madhya Pradesh Police anti-terror squad news, Ayurveda doctor Sayyed Abdul Rahman Khan arrest, private clinic in Nanded, Ansarul Muslimeen, Kamla Nagar Police Station,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X