వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 ఏళ్ల హిస్టరీ మహారాష్ట్రలో రిపీట్ కానుందా.. సీఎం కుర్చీ బీజేపీ నుంచి జారిపోనుందా?

|
Google Oneindia TeluguNews

ముంబై : మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి దూసుకెళ్లుతోంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టేలా ఫలితాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళ్లుతున్నారు. అదలావుంటే ఒకవేళ మహా ముఖ్యమంత్రిగా మరోసారి ఫడ్నవీస్ అధికార పగ్గాలు చేపడితే 50 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ కానుంది. 1967లో వసంత్ నాయక్ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ కూడా వరుసగా సీఎం కుర్చీ ఎక్కలేదు. అయితే శివసేన రూపంలో ఫడ్నవీస్‌ సీఎం కుర్చీకి పోటీ ఉందనే విషయం తెలిసిందే.

బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజ

బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. ఆ క్రమంలో బీజేపీ కూటమి అభ్యర్థులు చాలా చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే చాలా సెగ్మెంట్లలో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. అదలావుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి లీడింగ్‌లో ఉన్నారు. 1999లో తొలిసారిగా ఆయన ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇక్కడి నుంచే మళ్లీ గెలిచి ఏకంగా సీఎం కుర్చీ దక్కించుకున్నారు. ఆ క్రమంలో ఈసారి కూడా విజయం సొంతమైతే మూడోసారి గెలిచిన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టనున్నారు.

వంటేరు లక్కీ : ఆనాడు కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఈనాడు పదవిని చేపట్టి..!వంటేరు లక్కీ : ఆనాడు కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఈనాడు పదవిని చేపట్టి..!

అక్కడి నుంచి ఫడ్నవీస్ కూడా ఆధిక్యంలో

అక్కడి నుంచి ఫడ్నవీస్ కూడా ఆధిక్యంలో

నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానంలో తొలిసారిగా 1999లో గెలిచిన దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడి స్థానం తన ఖాతాలో పదిలపరుచుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు అక్కడి నుంచి గెలిచిన ఫడ్నవీస్ ఈసారి కూడా విజయ దుందుభి మోగించనున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం (24.10.2019) నాడు కౌంటింగ్ జరుగుతోంది. ఆ క్రమంలో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఈసారి కూడా ఫడ్నవీస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆయనే లీడింగ్‌లో ఉన్నారు.

2014 ఎన్నికల లెక్కలు ఇవే

2014 ఎన్నికల లెక్కలు ఇవే

2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 122 స్థానాల్లో విజయం దక్కింది. ఒక నామినేటేడ్ ఎమ్మెల్యేతో కలుపుకుంటే అసెంబ్లీలో బీజేపీ బలం 123కు చేరింది. ఇక శివసేన 63 స్థానాలను గెలుచుకుంది. ఆ క్రమంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం కుర్చీ దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 42 స్థానాలు.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలు దక్కాయి. మజ్లిస్ పార్టీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.

ఈసారి ఫడ్నవీస్ పగ్గాలు చేపడితే.. 50 ఏళ్ల చరిత్ర రిపీట్

ఈసారి ఫడ్నవీస్ పగ్గాలు చేపడితే.. 50 ఏళ్ల చరిత్ర రిపీట్

1960లో మహారాష్ట్ర మొదటి అసెంబ్లీ కొలువుదీరింది. ఆ క్రమంలో 1967లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా వసంత్ రావు నాయక్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఆయనే మరోసారి సీఎం కుర్చీ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కలేదు. అదలావుంటే ఈసారి ఫడ్నవీస్ గెలిచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన సీఎం కుర్చీ మళ్లీ దక్కించుకుంటే మహా రాజకీయ చరిత్రలో 50 ఏళ్ల సీన్ రిపీట్ కానుంది. వసంత్ రావు నాయక్ తర్వాత రెండోసారి వరుసగా సీఎం కుర్చీ ఎక్కిన ఘనత ఫడ్నవీస్‌కు దక్కనుంది.

ఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరుఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరు

ఆదిత్య థాకరే కూడా ముందంజలో.. సీఎం కుర్చీ కిస్సా..!

ఆదిత్య థాకరే కూడా ముందంజలో.. సీఎం కుర్చీ కిస్సా..!

అదలావుంటే థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే.

ఆయన ముంబై వర్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆదిత్య థాకరేకు పోటీగా ఎన్సీపీ నుంచి సురేశ్ మానే ఎన్నికల్లో తలపడ్డారు. అయితే వర్లి స్థానం నుంచి ఆదిత్య థాకరే కూడా ఆధిక్యంలో ఉన్నారు. శివసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆదిత్య థాకరే గెలిస్తే మహా రాజకీయంలో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవేళ తనకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలని పట్టుబడితే బీజేపీ పెద్దలు ఏం చేయనున్నారనేది చర్చానీయాంశమైంది.

English summary
maharashtra election results devendra fadnavis repeats the 50 years history. he leading in this elections, if he got cm chair once again, then fifty years history repeats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X