వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ.15వేలకు ఎకరం, పలుకుతోంది రూ.20 లక్షలు: నీరవ్ మోడీకి మహా రైతుల షాక్
ముంబై: నీరవ్ మోడీ గతంలో తీసుకున్న తమ పొలాలను మహారాష్ట్ర రైతులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిన నీరవ్ విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే.
అతనికి ఇప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రైతులు షాకిచ్చారు. గతంలో రైతుల దగ్గర నుంచి అతనికి చెందిన ఫైవ్ స్టార్ కంపెనీ పొలాలు తీసుకుంది. వాటిని రైతులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ రేటు కంటే తమకు తక్కువ డబ్బు చెల్లించారని, అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

దాదాపు 200 మంది రైతులు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లుగా జాతీయ జెండాలను పాతిపెట్టారు. త్వరలో 125 ఎకరాల స్థలంలో పంట సాగు చేపడతామన్నారు. ఇక్కడ ప్రభుత్వ ధర రూ.20 లక్షలు పలుకుతుంటే తమ నుంచి రూ.15వేలకు తీసుకున్నారని కొందరు ఆరోపించారు