వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర అసెంబ్లీలో హైలైట్స్:169 మంది ఎమ్మెల్యేల మద్దతు:విశ్వాస పరీక్ష నెగ్గిన ఉద్ధవ్ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ముంబై:మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం రెండు నెలల ప్రతిష్టంభన తర్వాత ఏర్పాటు అయ్యింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు అయ్యింది. ఇక సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన విశ్వాస పరీక్షలో ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం విజయం సాధించింది. ఉద్ధవ్‌కు మద్దతుగా 169 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఇక సభలో ప్రొటెం స్పీకర్ వ్యవహారంపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. సభలో బీజేపీ సభ్యులు లేకుండానే బలనిరూపణ కార్యక్రమం నిర్వహించారు ప్రొటెం స్పీకర్.

Maharashtra Floor Test Live Updates: Will Uddhav Prove Majority

అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అర్థరాత్రి 1గంటలకు సమన్లు ఇవ్వడమేంటంటూ సభలో బీజేపీ నేత ఫడ్నవీస్ ప్రశ్నించారు. సభ అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయని మండిపడ్డారు. బలపరీక్షలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విజయం సాధించిందని ప్రొటెం స్పీకర్ దిలీప్ డిక్లేర్ చేసి సభను ఆదివారంకు వాయిదా వేశారు. ఇక శనివారం సభలో జరిగిన అన్ని అంశాలు మినిట్‌ టూ మినిట్ అప్‌డేట్స్ హైలైట్స్ మీకోసం

Newest First Oldest First
4:15 PM, 30 Nov

పార్లమెంటులో క్రమశిక్షణ గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. అదే సమయంలో బీజేపీకి చెందిన పార్టీ నేతలే మహారాష్ట్ర అసెంబ్లీలో క్రమశిక్షణ తప్పారు: ఎన్సీపీ మహిళా నేత
4:12 PM, 30 Nov

ఇద్దరు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఒక సీపీఐఎం ఎమ్మెల్యే,ఒక ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఓటింగ్‌లో పాల్గొనలేదు
3:20 PM, 30 Nov

ఆదివారం జరగనున్న స్పీకర్ ఎన్నిక
3:19 PM, 30 Nov

ఆదివారంకు వాయిదా పడిన మహారాష్ట్ర అసెంబ్లీ
3:19 PM, 30 Nov

ఎప్పుడూ సభలో అడుగుపెట్టలేదు.. కేవలం గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసేవాడిని: ఉద్దవ్ థాక్రే
3:01 PM, 30 Nov

బలపరీక్ష సమయంలో వాకౌట్ చేసిన బీజేపీ.. లెక్కింపు సందర్భంగా సభలో లేని బీజేపీ ఎమ్మెల్యేలు
2:55 PM, 30 Nov

ఉద్దవ్ ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు
2:54 PM, 30 Nov

బలనిరూపణలో విజయం సాధించిన ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం, 145 మ్యాజిక్ ఫిగర్‌ను తాకిన ప్రభుత్వం
2:49 PM, 30 Nov

తిరిగి అసెంబ్లీలోపలికి వెళ్లిన బీజేపీ సభ్యులు
2:48 PM, 30 Nov

మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో అసెంబ్లీ మెట్లపై నిరసనలకు దిగిన బీజేపీ
2:47 PM, 30 Nov

గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం ఎప్పుడు ఏంటనేది చెబుతాం: బీజేపీ
2:45 PM, 30 Nov

బీజేపీ వాకౌట్ చేయడంతో మొదటి పరీక్ష పాసైన మహావికాస్ అగాడీ ప్రభుత్వం
2:42 PM, 30 Nov

ప్రారంభమైన హెడ్ కౌంట్..ఉద్ధవ్ థాక్రేకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పిన అజిత్ పవార్
2:41 PM, 30 Nov

ఎమ్మెల్యేల మద్దతు లభించదనే భయంతోనే ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేసి ఆయన పర్యవేక్షణలో ప్రమాణస్వీకారం చేయించారు: ఫడ్నవీస్
2:40 PM, 30 Nov

గవర్నర్ నేను అని చెప్పగానే ప్రమాణస్వీకారం చేయాల్సిన మంత్రులు బాల్‌ థాక్రే, సోనియాగాంధీ, శరద్ పవార్‌ల పేర్లు చెప్పారు: ఫడ్నవీస్
2:39 PM, 30 Nov

సభ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోంది. మంత్రుల ప్రమాణస్వీకారం కూడా సరిగ్గా జరగలేదు: ఫడ్నవీస్
2:36 PM, 30 Nov

అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్..బయటకు వచ్చిన ఫడ్నవీస్
2:35 PM, 30 Nov

సుప్రీం కోర్టు ఆదేశాలు సూచనల మేరకే బలపరీక్ష జరుగుతుంది: ప్రొటెం స్పీకర్
2:33 PM, 30 Nov

సభలో విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశం
2:32 PM, 30 Nov

సంకీర్ణం ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా సభలో తీర్మానం ప్రవేశపెట్టాయి
2:30 PM, 30 Nov

ఉద్దవ్ థాక్రే సీఎంగా తీర్మానం ప్రవేశపెట్టిన అశోక్ చవాన్
2:30 PM, 30 Nov

బలనిరూపణకు ఆదేశాలు ఇచ్చిన ప్రొటెం స్పీకర్
2:29 PM, 30 Nov

బలనిరూపణ లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది: ప్రొటెం స్పీకర్
2:28 PM, 30 Nov

గవర్నర్ నియమించిన స్పీకర్ రాజీనామా చేయకుండానే కొత్తగా ప్రొటెం స్పీకర్‌ను ఎలా నియమిస్తారు: ఫడ్నవీస్
2:27 PM, 30 Nov

బలనిరూపణకు తొందర ఎందుకు: బీజేపీ
2:26 PM, 30 Nov

స్పీకర్‌ను గవర్నర్ నియమించారు.ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం స్పీకర్‌ను తొలగించి ప్రొటెం స్పీకర్‌ను ఎలా నియమిస్తుంది: ఫడ్నవీస్
2:25 PM, 30 Nov

ప్రొటెం స్పీకర్ ఎన్నిక ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉంటుంది: అగాడీ
2:25 PM, 30 Nov

ప్రొటెం స్పీకర్ ఎన్నికపై సభలో గందరగోళం
2:25 PM, 30 Nov

బలపరీక్షకు ముందే స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది: చంద్రకాంత్ పాటిల్
2:22 PM, 30 Nov

ప్రోటెం స్పీకర్ మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? : ఫడ్నవీస్
READ MORE

English summary
The Uddhav Thackeray-led Maha Vikas Aghadi government of the Shiv Sena-NCP-Congress alliance will face floor test in the Assembly on Saturday.The floor test will be held in the afternoon, a Vidhan Bhawan official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X