• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొవిడ్ వ్యాధికి పండ్ల వ్యాపారి వైద్యం -ఏకంగా క్లినిక్ పెట్టేసి డాక్టర్‌గా భారీ బిల్డప్ -అరెస్టు చేసిన పోలీసులు

|

ఒకడు గోమూత్రం తాగమంటాడు.. ఇంకొకడు పసుపును గోరుముద్దలుగా తినాలంటాడు.. వాట్సాప్ యూనివర్సిటీలోనైతే ప్రిస్క్రిప్షన్లకు అంతే ఉండదు.. కరోనా విలయకాలంలో జనం భయాలను ఆసరసాగా తీసుకుని తప్పుడు సలహాలిచ్చే మేతావులు, ప్రజల ఆందోళనను క్యాష్ చేసుకునే నకిలీరాయుళ్లు పెరుగుతున్నారు. కోవిడ్-19 మహమ్మారిని కొందరు స్వార్థపరులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది..

కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్

వైద్య రంగంలో ఎటువంటి ప్రవేశం లేనివారు సైతం కోవిడ్‌కు మందులు ఇస్తామంటూ ప్రజలను దోచుకుంటోన్న మరో ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది. చేసేది పండ్ల వ్యాపారమే అయినా చిన్న చిన్న చిట్కాలతో మొదలై ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తేసి కొవిడ్ రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఘనుడు. పండ్లు అమ్ముకునే ఆ వ్యక్తి వైద్యుడిగా అవతారమెత్తి కోవిడ్-19 వ్యాధిగస్థులను మోసం చేస్తున్నందుకు పోలీసులు అరెస్టు చేశారు.

Maharashtra: Fruit vendor poses as doctor, treats Covid-19 patients in Nagpur, arrested

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌లోని కమఠి ప్రాంతంలో నివసిస్తున్న చందన్ నరేశ్ చౌదరి ఓ సాధారణ వ్యాపారి. పండ్లు, ఐస్ క్రీమ్ అమ్ముకునేవారు. ఎలక్ట్రీషియన్‌గా కూడా పని చేస్తూంటాడు. సామాజిక సేవా దృక్ఫథంతో ఐదేళ్లుగా 'ఓం నారాయణ మల్టీపర్పస్ సొసైటీ' పేరుతో ఓ చారిటబుల్ డిస్పెన్సరీని నడుపుతున్నారు. అక్కడికి వచ్చే రోగులకు ఆయుర్వేదం మందులు ఇస్తూండేవాడు. అలా..

చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -'ఎన్440కే కరోనా వేరింట్'పై నోటీసులు -సీఎం జగన్‌కు సిగ్గులేదంటూచంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -'ఎన్440కే కరోనా వేరింట్'పై నోటీసులు -సీఎం జగన్‌కు సిగ్గులేదంటూ

ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితిని ఆసరాగా తీసుకుని, చందన్ నరేశ్ చౌదరి తన డిస్పెన్సరీలో కొవిడ్ రోగులకు చికిత్స ఇవ్వడం మొదలుపెట్టాడు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సిరంజిలు, ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్‌ తో చిన్నపాటి ఆస్పత్రిని నడిపిస్తున్నారు. ఈ ఉదంతంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు డిస్పెన్సరీని తనిఖీ చేయగా గుట్టు బయటపడింది. మహారాష్ట్ర ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారం పండ్ల వ్యాపారి చౌదరిని అరెస్టు చేశారు. కొవిడ్ వ్యాధికి సొంత వైద్యం, ఇంటి చిట్కాలు కూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

English summary
Afruit vendor was arrested in the Nagpur district of Maharashtra, for allegedly treating coronavirus patients on the pretext of being a doctor. Chandan Naresh Chaudhary, who hails from Kamthi area of Nagpur, used to sell fruits and ice cream. He later started working as an electrician, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X