వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Live: మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే.. అజిత్ పవార్‌కు మొండిచేయి.. మంత్రులుగా జయంత్, ఛగన్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ చేత శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. గవర్నర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ తప్పపడుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు బీజేపీ, ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి తరఫున వాదనలు విన్న సుప్రీం.. తీర్పును మంగళవారం 10.30 గంటలకు సంచలన తీర్పు వెల్లడించింది. దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ థాకరేను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తాజాగా చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాల గురించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Uddhav Thackeray

Newest First Oldest First
7:17 PM, 28 Nov

ముగిసిన మహారాష్ట్ర సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార వేడుక

ముగిసిన మహారాష్ట్ర సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార వేడుక.. భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానులు
7:06 PM, 28 Nov

మంత్రిగా ప్రమాణం చేసిన నితిన్ రౌత్

మంత్రిగా ప్రమాణం చేసిన నితిన్ రౌత్, నాగపూర్ నార్త్ నుంచి గెలిచిన దళిత నేత
7:02 PM, 28 Nov

మంత్రిగా బాలాసాహెబ్ థోరాట్

మంత్రిగా బాలాసాహెబ్ థోరాట్, సంగంనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా సేవలు
6:58 PM, 28 Nov

మంత్రిగా ఛగన్ భుజ్‌బల్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోలా నియోజకవర్గం ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్
6:55 PM, 28 Nov

జయంత్ పాటిల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

ఇస్లాంపూర్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం
6:54 PM, 28 Nov

మంత్రిగా ప్రమాణం చేసిన సుభాష్ దేశాయ్..

ఉద్దవ్ థాకరే‌తోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన సుభాష్ దేశాయ్..
6:53 PM, 28 Nov

మంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం

మంత్రిగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్ షిండే
6:45 PM, 28 Nov

సీఎంగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాకరే

అభిమానుల కేరింతలు, బాణాసంచా మధ్య మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాకరే
6:39 PM, 28 Nov

హాజరైన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
6:36 PM, 28 Nov

శివాజీ పార్క్‌కు చేరుకొన్న ఉద్దవ్ థాకరే

శివాజీ పార్క్‌కు చేరుకొన్న ఉద్దవ్ థాకరే
శివాజీ పార్క్‌కు చేరుకొన్న ఉద్దవ్ థాకరే.. కాసేపట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం
6:33 PM, 28 Nov

స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగాలు

స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగాలు, చట్టం చేయడానికి మహా వికాస్ అఘాదీ నిర్ణయం
6:30 PM, 28 Nov

రాజ్ థాకరే, ఎంకే స్టాలిన్, ఆహ్మద్ పటేల్

ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకొన్న రాజ్ థాకరే, ఎంకే స్టాలిన్, ఆహ్మద్ పటేల్ తదితరులు
5:50 PM, 28 Nov

8 గంటలకు సీఎం ఉద్దవ్ థాకరే క్యాబినెట్ భేటీ

ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే 8 గంటలకు సీఎం ఉద్దవ్ థాకరే క్యాబినెట్ భేటీ..
5:32 PM, 28 Nov

సాయంత్రం 6.40 గంటలకు ప్రమాణం

ముంబైలోని శివాజీ పార్కులో సాయంత్రం 6.40 గంటలకు మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే ప్రమాణం
5:28 PM, 28 Nov

మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.. సోనియా

మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.. ఉద్దవ్ థాకరేకు సోనియా లేఖ
4:57 PM, 28 Nov

రైతు రుణమాఫీ, తక్షణ సహాయంపై..

కామన్ మినిమమ్ ప్రొగ్రాంలో రైతు రుణమాఫీ, తక్షణ సహాయంపై నిర్ణయం, పంట భీమా స్కీమ్ సవరణ తదితర అంశాలు
4:55 PM, 28 Nov

కామన్ మినిమమ్ ప్రొగ్రాం విడుదల

మహారాష్ట్రలో కామన్ మినిమమ్ ప్రొగ్రాంను విడుదల చేసిన శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ
4:50 PM, 28 Nov

మాకు ఆహ్వానం అందలేదు.. తృణమూల్

ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి సీఎం మమతా బెనర్జీకి అధికారికంగా ఆహ్వానం అందలేదు.. తృణమూల్
1:22 PM, 28 Nov

భారీ మూల్యం చెల్లించుకొన్నాం.. బీజేపీ

అజిత్ పవార్‌తో చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకొన్నాం.. బీజేపీ ఖాడ్సే
12:26 PM, 28 Nov

అజిత్ పవార్ ఫోన్ స్విచ్ఛాఫ్.. అందుబాటులో లేకుండా

అజిత్ పవార్ ఫోన్ స్విచ్ఛాఫ్.. ఆయన అందుబాటులో లేరు. అనవసరమైన ఫోన్ కాల్స్ కంట్రోల్ చేయడం కోసమే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. అయితే సాయంత్రం ఉద్దవ్ ప్రమాణ స్వీకారానికి వస్తారు.. ఎన్సీపీ అధికార ప్రతినిధి
11:47 AM, 28 Nov

ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి ముందే

ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి ముందే కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేయనున్న కూటమి
11:34 AM, 28 Nov

డిప్యూటీ సీఎం పదవిపై చర్చ జరగలేదు.. బాలాసాహెబ్ థోరట్

సీఎం ఉద్దవ్ థాకరే, మరికొందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. డిప్యూటీ సీఎం పదవిపై చర్చ జరగలేదు.. బాలాసాహెబ్ థోరట్
11:17 AM, 28 Nov

కేబినెట్ పదవుల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.
10:57 AM, 28 Nov

కేబినెట్ పదవులపై అసంతృప్తి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఎంత కాలం మనగలుగుతుందనే చర్చ సాగుతోంది.
10:21 AM, 28 Nov

ఉద్దవ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీ గైర్హాజరు
10:21 AM, 28 Nov

ఉద్దవ్ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ వస్తారా.. రావడం లేదా అనే అంశంపై స్పష్టత లేదు.
9:41 AM, 28 Nov

ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, కేజ్రీవాల్, స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
9:40 AM, 28 Nov

శివాజీ పార్క్ మైదానంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
9:40 AM, 28 Nov

సాయంత్రం గ.6.40 నిమిషాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారం.
9:34 AM, 28 Nov

ఉద్దవ్ థాకరే సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
READ MORE

English summary
On Saturday morning, NCP leader Ajit Pawar sworn in as deputy chief minister of Maharashtra alongwith BJP's Devendra Fadnavis. The unexpected move given shock to Shiv Sena chief Uddhav Thackeray emerged as the Sena-NCP-Congress' consensus candidate for the chief minister's post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X