వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఠాక్రే కు పరాభవం: పవార్ సీఎం అవుతారా: రాష్ట్రపతి పాలన విధిస్తారా!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి కావాలని కలలు కలని..చిరకాల మిత్రుడు బీజేపీతో బంధం వదులుకున్న శిసేనకు ఆశాభంగం ఎదురైంది. కాంగ్రెస్ రాజకీయంతో ఊహింని ఎదురు దెబ్బ తిన్నది. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స కోల్పోయింది.ఎన్సీపీ.. కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి షాక్ ఇవ్వాలనుకున్న శివసేన నేతలకు ఇది ఒక రకంగా పరాభవమే. ఇక, ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే కాదు.. శివసేన సైతం మద్దతిస్తేనే ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేది.

అయితే, ఇప్పుడు తమ అవకాశాన్ని చే జార్చిన కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తుందా. అదే సమయంలో దూరంగా ఉంటే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నట్లే అని అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇక, ఎన్సీపీకి ఈ రెండు పార్టీలు మద్దతిస్తే..పవార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. లేకుంటే..ఇక చివరి అస్త్రంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదు. ఈ సాయంత్రానికి సస్పెన్స్ థ్రిల్లర్ కు ముగింపు లభించే అవకాశం ఉంది.

శివసేనకు ఆశాభంగం..తదుపరి అడుగులు ఎటు..

శివసేనకు ఆశాభంగం..తదుపరి అడుగులు ఎటు..

కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరించి శివసేనకు మద్దతిస్తున్నట్లుగా సంకేతాలిస్తూనే..దెబ్బ తీసింది. పరోక్షంగా తమ మిత్రపక్ష మైన ఎన్సీపీకి పీఠం దక్కే విధంగా పావులు కదుపుతోంది. అయితే, కాంగ్రెస్ తమకు మేలు చేస్తుందని ఊహించిన శివసేన..తమను వ్యూహాత్మకంగానే అధికారినికి దూరం చేసిందని ఇప్పుడు గుర్తించింది. దీంతో..ఇప్పుడు ఎన్సీపీకి కాంగ్రెస్ మద్దతివ్వటం ఖాయం.

శివసేన సైతం మద్దతిస్తేనే

శివసేన సైతం మద్దతిస్తేనే

అదే సమయంలో శివసేన సైతం మద్దతిస్తేనే పవార్ ముఖ్యమంత్రి కాగలిగేది. తమకు సహకరించని కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండాలా లేదా అనేది శివసేన ఇంకా తేల్చుకోలేదు. తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తే శివసేన మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే, ఎన్సీపీ అదే రకమైన ఒప్పందం కాంగ్రెస్ తో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ శివసేన అదే అంశం పైన నిలబడితే..ఎన్సీపీ సైతం ప్రభుత్వం ఏర్పాటు చేటయం కష్టమే. దీంతో..బీజేపీ అనుకున్నట్లుగానే రాష్ట్రపతి పాలన విధించిక తప్పదు. అది శివసేనకు ఇష్టం ఉన్నట్లుగా కనిపించటం లేదు.

పవార్ ముఖ్యమంత్రి అవుతారా.. శివసేన ఏం చేస్తుంది..

పవార్ ముఖ్యమంత్రి అవుతారా.. శివసేన ఏం చేస్తుంది..

ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించటంతో ఎన్సీపీకి ఉన్న 54 స్థానాలకు..కాంగ్రెస్ కు ఉన్న 44 స్థానాలు కలిసి ఆ కూటమికి 98 సభ్యుల మద్దతు ఉంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల మద్దతు అవసరం. శివసేన కు ఉన్న 56 మంది మద్దతు లభిస్తే పవార్ ముఖ్యమంత్రి అవ్వటం సులభమే. అయితే, తమ అవకాశాలను చేజార్చిన కాంగ్రెస్ తో కలిసి శివసేన కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు సందేహమే.

బీజేపీ దూరం కావడంతో

బీజేపీ దూరం కావడంతో

అయితే, ఇదే సమయంలో బీజేపీ తోనూ శివసేన దూరమైంది. ఇప్పటికే ఎన్సీపీ..కాంగ్రెస్ తో సంప్రదింపులు చేసిన విషయాన్ని ఆదిత్య థాక్రే స్వయంగా వెల్లడించారు. దీంతో..ఇప్పుడు అనివార్యంగా ఎన్సీపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వంలో ఎన్సీపీ..కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకోవటంలో శివసేన నిర్ణయం కీలకంగా మారనుంది. ఇక, కాంగ్రెస్ సైతం ఇప్పుడ ఎన్సీపీకి మద్దతిచ్చే విషయం లో అభ్యంతరం లేకపోయినా..శివసేనతో ఎలా వ్యవహరించాలనే నిర్ణయం మొత్తం విషయాన్ని డిసైడ్ చేయనుంది.

అంతిమంగా రాష్ట్రపతి పాలన దిశగా..

అంతిమంగా రాష్ట్రపతి పాలన దిశగా..

ఇక, ఎన్సీపీకి గవర్నర్ ఈ రాత్రి వరకు సమయం ఇచ్చారు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఎన్సీపీకి మద్దతిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే, ఇప్పుడు శివసేన నిర్ణయం.. వారు పెట్టే షరతులు అధారంగా తుది నిర్ణయం ఉండనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు ప్రభుత్వంలో అవకాశం దక్కటం కష్టమని శివసేన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రపతి పాలన తప్పదా?

రాష్ట్రపతి పాలన తప్పదా?

బీజేపీతో ఇదే విషయం పైన తెగ దెంపులు చేసుకున్న శివసేన..మరి అదే విషయంలో ఇప్పుడు ఎన్సీపీతో రాజీ పడుతుందా.. కటీఫ్ చెబుతుందా అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఈ సాయంత్రానికి ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనా.. లేక రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం ఉంటుందా అనేది తేలిపోనుంది.

English summary
Maharastra Suspense poliltics may conclude by to day evening. congress may suppot NCP directly. But, Now the Shiva sena decision may become cruicial for NCP. If Shivasena not interest to support NCP and cong govt then President rule may impose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X