వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మహా సర్కార్

|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్ రైలు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా క్రింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించినట్లు తెలుస్తుంది . ఈ రోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో 19 మంది వలస కార్మికులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకోవటానికి సాధ్యమయ్యే సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

ముంబై సెంట్రల్ జైలులో ఖైదీలు, సిబ్బందితో సహా 103 మందికి కరోనా పాజిటివ్ముంబై సెంట్రల్ జైలులో ఖైదీలు, సిబ్బందితో సహా 103 మందికి కరోనా పాజిటివ్

కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి . క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పీఎం మోడీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర ఆవేదనతో ఉన్నానని ట్వీట్‌లో ప్రధాని చెప్పారు. రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్‌తో మాట్లాడానని, ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు .

Maharashtra govt announces ex-gratia for families of train accident victims families

కార్మికులు మధ్యప్రదేశ్ కు తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్స్ వెంట నడుస్తున్నారు. వారు అలసట కారణంగా రైలు పట్టాలపై పడుకున్నారు. రైళ్ళు తిరగటం లేదని భావించి వారు రైలు పట్టాలపై పడుకున్నారు . మంచి నిద్రలో ఉండగా గూడ్స్ రైలు వారిపై దూసుకుపోయింది . ఇక 19 మంది మృతుల‌ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

English summary
Maharashtra Chief Minister's Office has declared Rs 5 lakh each has been announced as ex gratia compensation to families of the deceased in the Aurangabad train accident. Prime Minister Narendra Modi on Friday expressed anguish over the death of migrant workers in a train accident in Maharashtra's Aurangabad.He said all possible assistance was being provided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X