వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎంవీఏ కూటమి హవా -తామే గెలిచామంటోన్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో సుదీర్ఘకాలం బీజేపీతో అంటకాగి, సడెన్‌గా కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపిన తర్వాత కూడా రాష్ట్రంలో శివసేన ప్రభావం యధావిధిగా కొనసాగుతోంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, దానికి దాదాపు సమాన స్థాయిలో శివసేన సీట్లు సాధించింది. ఆ రెండు పార్టీలకు ధీటుగా ఎన్సీపీ అభ్యర్థులు గెలవగా, కాంగ్రెస్ సైతం చక్కటి ప్రదర్శన ఇచ్చింది. మొత్తంగా శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, తాను కూడా గెలిచినట్లు బీజేపీ ప్రకటించుకుంది..

తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్

మహారాష్ట్రలోని 34 జిల్లాల్లోగల 14,234 గ్రామపంచాయితీలకు గత వారం ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం, కొవిడ్ ప్రొటోకాల్ కారణంగా కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. రాత్రి 10 గంటల వరకు 12, 503 పంచాయితీల్లో లీడ్లు వెలవడ్డాయి. ఆ లెక్కల ప్రకారం..

 Maharashtra Gram Panchayat Election Results 2021: MVA Alliance, BJP Claim Win

ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని మొత్తం 14,234 పంచాయితీలకుగానూ, 2,912 చోట్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో లేదా విజయం సాధించారు. 2,724 పంచాయితీల్లో శివసేన అభ్యర్థులు లీడ్ లేదా గెలుపు సాధించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బలపర్చిన అభ్యర్థులు 2,673 పంచాయితీల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1905 పంచాయితీలను కైవసం చేసుకునే దిశగా వెళుతున్నారు. 2,289 పంచాయితీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్లు ప్రభావం చూపించారు. కాగా..

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టుunnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

పంచాయితీ ఎన్నికల్లో కూటమిగా ఎంవీఏకు దాదాపు 60 శాతం సీట్లు దక్కడం అద్భుతమైన విషయమని, ఇది భారీ విజయమని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, మూడు పార్టీలూ ఏకమైనప్పటికీ, బీజేపీ ఒంటరిగా పోరాడి సింగిల్ లార్జెస్ట్ పార్టీలా అవతరించిందని, పంచాయితీ ఎన్నికల్లో అసలైన గెలుపు తమదేనని బీజేపీ నేతలు క్లెయిమ్ చేసుకున్నారు. మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయానికి వెలువడనున్నాయి.

English summary
The election results to the 12,711 gram panchayats spread across 34 districts in Maharashtra came out on friday. the outcome which the ruling Maha Vikas Aghadi (MVA) claimed a "huge win" while the opposition BJP said it had come out stronger. Though the village panchayat elections are not fought on party symbols, panels are fielded by political parties or local leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X