వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ, హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం నిర్వహించారు. ఇక నేతల భవితవ్యం ఓటర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

మహారాష్ట్రలో 288 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145గా ఉంది. మహారాష్ట్రలో అధికారిక బీజేపీ శివసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుండగా కాంగ్రెస్ ఎన్సీపీల బంధం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రే బరిలో దిగనున్నారు. ఇక చాలామంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ సైతం తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. వారి తరపున మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు.

elections

ఇక హర్యానా విషయానికొస్తే అక్కడ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46గా ఉంది. హర్యానాలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేసి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫథకాల గురించి వివరించారు. హర్యానాలో భద్రత కట్టుదిట్టం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం అక్కడ భద్రతను మరింత పెంచింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి నిఘా ఉంచింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలు సంఘం సూచించింది. ఓటింగ్ సందర్భంగా ఏమైనా అనుమానాలుంటే అధికారులను సంప్రదించాల్సిందిగా ఎన్నికల సంఘం వెల్లడించింది.

అక్టోబర్ 21న పోలింగ్ జరగనుండగా ఎగ్జిట్ ఫలితాలు అదే రోజు సాయంత్రం వెలువడుతాయి. అక్టోబర్ 24న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంకు జరుగుతున్న ఉపఎన్నికలకు సంబంధించి మినిట్‌-టూ - మినిట్ అప్‌డేట్స్ లైవ్‌ కోసం చూడండి.

Newest First Oldest First
8:45 PM, 21 Oct

హర్యానాలో 65 శాతం పోలింగ్ నమోదు
6:07 PM, 21 Oct

ముంబై మహానగరంలో 44 శాతం పోలింగ్
6:07 PM, 21 Oct

పుదుచ్చేరి 66.95 శాతం పోలింగ్ నమోదు
6:06 PM, 21 Oct

మహారాష్ట్రలో 54.శాతం పోలింగ్ నమోదు
6:05 PM, 21 Oct

ఛత్తీస్‌ఘడ్

చిత్రకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 74.39 శాతం పోలింగ్ నమోదు
5:34 PM, 21 Oct

పుణె

ఎన్సీఎల్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
5:10 PM, 21 Oct

ముంబై

బాంద్రా వెస్ట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్
5:08 PM, 21 Oct

హర్యానాలో 60 శాతం పోలింగ్ దాటే అవకాశం, మహారాష్ట్రలో 50 నుంచి 60 శాతం మధ్య పోలింగ్
5:08 PM, 21 Oct

మహారాష్ట్ర, హర్యానాలో మందకొడిగా సాగిన పోలింగ్
5:04 PM, 21 Oct

హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఈవీఎంల తరలింపు, అక్కడినుంచి సూర్యాపేటకు షిప్ట్
5:03 PM, 21 Oct

క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
5:02 PM, 21 Oct

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశంలోని 51 స్థానాలకు ముగిసిన పోలింగ్
5:02 PM, 21 Oct

85 శాతం పోలింగ్ నమోదవుతుందని అధికారుల అంచనా
5:02 PM, 21 Oct

మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్
5:01 PM, 21 Oct

ముగిసిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్
4:16 PM, 21 Oct

హర్యానాలో మధ్యాహ్నం 3.30 గంటలకు 50.59 శాతం పోలింగ్ నమోదు
4:16 PM, 21 Oct

మహారాష్ట్ర

పుణెలో ఓటేసేందుకు తన ఫ్యామిలీతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన శతాధిక వృద్ధుడు హజీ ఇబ్రహీం అలీం జోద్ (102)
4:13 PM, 21 Oct

హుజూర్ నగర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదు
4:12 PM, 21 Oct

మహారాష్ట్రలో మధ్యాహ్నాం 3 గంటల వరకు 43.78 శాతం పోలింగ్ నమోదు
4:00 PM, 21 Oct

హిమాచల్ ప్రదేశ్

ధర్మశాల ఉప ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 52.18 శాతం పోలింగ్ నమోదు
3:52 PM, 21 Oct

ముంబై

మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలో 35 శాతం పోలింగ్ నమోదు
3:52 PM, 21 Oct

ముంబై

జుహులో ఓటుహక్కు వినియోగించుకున్న జయబాదురి, అభిషేక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్
3:51 PM, 21 Oct

ముంబై

జుహులో ఓటేసిన బీజేపీ ఎంపీ సన్నీ డియోల్
3:27 PM, 21 Oct

ముంబై

బాంద్రా వెస్ట్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో సతీ సమేతంగా ఓటువేస్తున్న గౌరి షారుఖ్‌ఖాన్ దంపతులు
3:19 PM, 21 Oct

ముంబై

ముంబైలో ఓటుహక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి స్మతీ ఇరానీ, 93 ఏళ్ల కన్నా జీని ఆదర్శంగా తీసుకోవాలని సూచన
3:14 PM, 21 Oct

ముంబై

ముంబై వెస్ట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ తారలు అనిల్ కపూర్, హృతిక్ రోషన్
3:12 PM, 21 Oct

మహారాష్ట్ర

మధ్యాహ్నం 1 గంట వరకు మహారాష్ట్రలో 30.89 పోలింగ్ నమోదు
3:11 PM, 21 Oct

ముంబై

ముంబైలో ఓటుహక్కు వినియోగించుకున్న షబానా అజ్మీ, జావేద్ అక్తర్
3:10 PM, 21 Oct

ముంబై

ముంబైలో ఓటుహక్కు వినియోగించుకున్న దీపికా పదుకొనే
1:54 PM, 21 Oct

తెలంగాణ

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 52.89శాతం పోలింగ్ నమోదు
READ MORE

English summary
Election commission have made all the necessary arrangements for Maharashtra and Haryana Assembly elections. Polling begins from 7Am and will close by 5pm said the CEC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X