వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదం: సంజయ్‌దత్‌కు 'మహా' షాక్, పెరోల్‌పై విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఎరవాడ జైలు నుండి తాత్కాలిక బెయిల్ పైన విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. సంజయ్ దత్ పెరోల్ పైన బుధవారం నాడు జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, అతనికి సరైన కారణాలతో సెలవు మంజూరు అయిందా లేదా అని మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.

మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే శుక్రవారం నాడు మాట్లాడుతూ.. సంజయ్ దత్‌కు తాత్కాలిక సెలవులు తరుచూ ఇస్తున్నారని, ఇది సరైన కారణాలతో ఇస్తున్నారా లేదా అనేది చూస్తామని చెప్పారు. ఇలా మరెవరికైనా ఇచ్చారా చూస్తామన్నారు.

Maharashtra to Investigate Furlough Granted to Actor Sanjay Dutt

తాము దీనిని పరిశీలిస్తామని, ఎవరికి కూడా అన్యాయం జరగవద్దన్నారు. ఎవరికి కూడా ఫేవర్‌గా ఉండవద్దని తాను ఆదేశించానని చెప్పారు. అలా ఏదైనా ఉంటే మాత్రం దాని పైన విచారణ చేస్తామని చెప్పారు. ఇలా హోంమంత్రి దర్యాఫ్తు చేపట్టడం ఇదే తొలిసారి కాదని, ఇది సాధారణ ప్రక్రియ అని హోంమంత్రి చెప్పారు. తాత్కాలిక బెయిల్‌లు వస్తుండటంతో సంజయ్ దత్ చుట్టు మరో వివాదం ముసురుకుంది.

కాగా, 1993 అల్లర్ల కేసులో సంజయ్ దత్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అతనికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతనికి ఇటీవల తాత్కాలిక బెయిల్ మంజూరయింది. దీంతో అతను బుధవారం నాడు విడుదలయ్యారు. గత ఏడాది కూడా అతనికి ఇలాగే పెరోల్ వచ్చింది. దీంతో అనుమానిస్తున్నట్లుగా చెబుతున్నారు.

English summary
The Maharashtra government has said it will investigate the 14-day furlough - a temporary leave of absence - granted to actor Sanjay Dutt, which allowed him to leave jail yet again on Christmas eve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X