• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వేలల్లో పుట్టుకొస్తున్న కరోనా కేసులు: పొరుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్?

|

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా 70 శాతం మేర ఉంటోంది. ముంబై, పుణె, నాసిక్, నాగ్‌పూర్, షోలాపూర్, అహ్మద్ నగర్ వంటి ప్రముఖ నగరాలన్నీ మరోసారి కరోనా బారిన పడ్డాయి. ఆయా నగరాల్లో వెలుగులోకి వచ్చిన కరోనా కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇప్పటికే పలు నగరాల్లో ఆదివారం పూట సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని భావిస్తోంది.

డేంజర్ బెల్స్: 28 లక్షలకు కరోనా మరణాలు: టాప్-4 దేశాల లిస్ట్‌లో భారత్: 13 కోట్లకుడేంజర్ బెల్స్: 28 లక్షలకు కరోనా మరణాలు: టాప్-4 దేశాల లిస్ట్‌లో భారత్: 13 కోట్లకు

ఒక్కరోజులో 40 వేలకుపైగా..

ఒక్కరోజులో 40 వేలకుపైగా..

ఆదివారం అధికారులు విడుదల చేసిన కరోనా వైరస్ రోజువారీ బులెటిన్ ప్రకాంర.. మహారాష్ట్రలో ఒక్కరోెజు వ్యవధిలో 40,414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ108 మంది మరణించారు. స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం ఇదే తొలిసారి. ఇదివరకు కరోనా వైరస్ తొలివిడత విజృంభణలోనూ ఈ రేంజ్‌లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పుడక్కడ 3,25,901 యాక్టివ్ కరోనా కేసులు కొనసాగుతున్నాయి. మొత్తం కేసులు 27,13,875 వరకు ఉండగా..23,32,453 మంది డిశ్చార్జ్ అయ్యారు. 54,181 వేల మంది కరోనా కాటుకు బలి అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్..

రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్..

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలను ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమైన అనంతరం ఈ ప్రతిపాదనలను తెరమీదికి తీసుకొచ్చింది. కరోనా కట్టడి చర్యలను జిల్లాలవారీగా తీసుకుంటోన్నప్పటికీ.. వాటికి బ్రేకులు పడట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసుల వ్యాప్తిని కట్టడి చేయడానికి రాష్ట్రస్థాయిలో సంపూర్ణ లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రభుత్వానికి సూచించారు.

ఏప్రిల్ 1 నుంచి..

ఏప్రిల్ 1 నుంచి..


సంపూర్ణ లాక్‌డౌన్ ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంపై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి లాక్‌డౌన్ అమలు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.కనీసం రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని, దాని తరువాత అప్పటి పరిస్థితులను సమీక్షించి.. దాన్ని పొడిగించడమా? లేక అక్కడితో అన్‌లాక్ చేయడమా? అనేది ప్రభుత్వం నిర్ధారిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైలో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉంటోంది.

ప్రధాన నగరాలన్నీ హాట్‌స్పాట్లే..

ప్రధాన నగరాలన్నీ హాట్‌స్పాట్లే..


ముంబై సహా మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాలు కరోనా వైరస్ కొత్త కేసులు పుట్టుకుని రావడానికి హాట్‌స్పాట్లుగా మారాయి. ఒక్కరోజులో ముంబై-6,933, పుణె-8,364, నాగ్‌పూర్-3,999 కేసులు రికార్డ్ అయ్యాయి. అత్యధికంగా పుణెలో 62,022 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. థానె, రాయ్‌గఢ్, పాల్‌ఘర్, సతారా, షోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్, ఔరంగాబాద్ వంటి చోట్ల ఇప్పటిదాకా నమోదైన కేసులు 50 వేలకు పైమాటే. అమరావతి, చంద్రాపూర్, బుల్దానా, అకోలా, నాందెడ్, వార్ధా వంటి చోట్ల ఇదే ఉధృతి కొనసాగుతోంది. ఆయా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర జిల్లాల్లో నెలకొన్న తీవ్రత.. పొరుగునే ఉన్నతెలంగాణపైనా పడుతోంది.

English summary
Maharashtra is considering imposing a strict lockdown this week after recording the highest one-day jump in coronavirus infections of any Indian state since last March, officials said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X