• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ తప్ప ప్రత్యామ్నాయం లేదు .. ఏప్రిల్ 14 తర్వాత కీలక నిర్ణయం : మహా సర్కార్

|

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వినాశనం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో తాజాగా 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక పెరుగుతున్న మరణాలు సైతం మహారాష్ట్రలో మరణ మృదంగం మోగిస్తున్నాయి . ఇక తాజా పరిస్థితిలో మహారాష్ట్ర లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. మహా సర్కార్ ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించింది .

  Coronavirus in Maharashtra: వారంలో మూడు రోజులు స్ట్రిక్ట్ లాక్‌డౌన్, అన్నీ క్లోజ్...!!

  షాకింగ్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వరంగల్ జిల్లాలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ !!

   మహారాష్ట్రలోకరోనా పంజా .. దారుణ పరిస్థితులకు కారణాలివే

  మహారాష్ట్రలోకరోనా పంజా .. దారుణ పరిస్థితులకు కారణాలివే

  కరోనా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న ఇబ్బందులు, ఫలితాల వెల్లడికి జరుగుతున్న జాప్యం, వాటికితోడు ప్రజలు కరోనా నిబంధనలు అసలు పాటించకపోవడం క్రియాశీల కేసులపై పర్యవేక్షణ లేకపోవడం కేసులో పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్రకు సరిపడా టీకాలను సరఫరా చేయడం లేదని, మహారాష్ట్రలో దారుణ పరిస్థితుల దృష్ట్యా , కేంద్ర సహాయం అందడం లేదని మహా సర్కారు ఆరోపిస్తోంది.

  లాక్‌డౌన్‌ సహా కఠినమైన ఆంక్షలు విధించటం అనివార్యమని భావిస్తున్న మహా సర్కార్

  లాక్‌డౌన్‌ సహా కఠినమైన ఆంక్షలు విధించటం అనివార్యమని భావిస్తున్న మహా సర్కార్

  ఇదే సమయంలో లాక్‌డౌన్‌ సహా కఠినమైన ఆంక్షలు విధించటం అనివార్యమని లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం . విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు

  . మహారాష్ట్ర సిఎం ఆస్పత్రులలో ఆక్సిజన్ మరియు పడకల లభ్యత, రెమ్‌డెసివిర్ వాడకం, చికిత్స ప్రోటోకాల్‌లు, సౌకర్యాల సామర్థ్యం పెంచటం , కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు జరిమానాలు, ఆంక్షలు విధించడం వంటి అనేక అంశాలపై చర్చించారు.

   లాక్ డౌన్ అమలుకు రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సిఫారసు, ఏప్రిల్ 14 తర్వాత నిర్ణయం

  లాక్ డౌన్ అమలుకు రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సిఫారసు, ఏప్రిల్ 14 తర్వాత నిర్ణయం

  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిఎం ఉద్ధవ్ థాకరే నిర్వహించిన సమావేశంలో మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, వైద్య విద్య, పరిశోధన డైరెక్టరేట్ డాక్టర్ టిపి లహానే, టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ సంజయ్ ఓక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ సభ్యులు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించడం గురించి తగిన నిర్ణయం ఏప్రిల్ 14 తర్వాత తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే చెప్తున్నారు.

   లాక్ డౌన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు , మరేదైనా మార్గం ఉంటే చెప్పమన్న శివసేన

  లాక్ డౌన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు , మరేదైనా మార్గం ఉంటే చెప్పమన్న శివసేన

  అయితే మహారాష్ట్రలో లాక్ డౌన్ విధిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకకుంటుంది అని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, లాక్ డౌన్ తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదని, ఒకవేళ బిజెపి నేతల వద్ద ఏదైనా లాక్ డౌన్ ను తప్పించే మార్గం ఉంటే దాన్ని తమతో పంచుకోవచ్చని శివసేన నేతలు వెల్లడిస్తున్నారు.

  English summary
  corona worst hit in maharashtra continues . the shivsena government thinking about lockdown to control corona in state . An appropriate decision regarding imposing a lockdown in Maharashtra will be taken after April 14, state Health Minister Rajesh Tope said. state task force said that the prevailing coronavirus situation in the state is such that a lockdown is required.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X