వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:మహారాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్, పోలీసు అధికారి ద్వారా...? 100 మందికి పరీక్షలు...

|
Google Oneindia TeluguNews

కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రికి కూడా సోకింది. అతని ద్వారా కొద్దిమందికి వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. మంత్రి జితేంద్ర అవద్‌కు పోలీసు అధికారి ద్వారా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఆ పోలీసు అధికారి ద్వారా మంత్రికి.. మంత్రి ద్వారా మరికొంత మందికి వైరస్ అంటుకుంది.

ఎలా సోకిదంటే..

ఎలా సోకిదంటే..

ఇటీవల తబ్లిగి జమాత్ సభ్యులను పట్టుకునేందుకు ముంబ్రాకు సీనియర్ పోలీసు అధికారి వెళ్లాడు. అక్కడ 13 మంది బంగ్లాదేశీయులను, 8 మంది మలేషియాకు చెందినవారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ముంబ్రాకు చెందిన స్థానికులతో పోలీసు అధికారి ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సమయంలో వైరస్ సోకి ఉంటుంది. తర్వాత పోలీసు అధికారి మంత్రి జితేంద్రతో సమావేశమై.. పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో వైరస్ మంత్రికి వ్యాపించింది.

13వ తేదీన పరీక్ష

13వ తేదీన పరీక్ష

వైరస్ వ్యాపించిందనే అనుమానంతో ఈ నెల 13వ తేదీన మంత్రి జితేంద్ర కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు. కానీ నెగిటివ్ వచ్చింది. అయినా కుటుంబసభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉన్నారు. ఎందుకైనా మంచిదని థానేలో గల ఆస్పత్రిలో గురువారం పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసు అధికారికి తబ్లిగి సభ్యులతో వైరస్ సోకలేదు. అతను వారం క్రితం తన స్వస్థలం నాసిక్ వెళ్లొచ్చారు. కానీ ముంబ్రాలో స్థానికుల వల్ల వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

100 మందికి పరీక్షలు

100 మందికి పరీక్షలు

మంత్రి జితేంద్ర, పోలీసు అధికారికి కరోనా వైరస్ సోకడంతో.. వారు కాంటాక్ట్‌లో ఉన్న వారిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరీక్షలు చేశారు. దాదాపు 100 మందికి పరీక్ష చేయగా.. థానెకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు, ముంబ్రా పోలీసుస్టేషన్‌లో ముగ్గురు పోలీసులు, మంత్రి జితేంద్ర ఇంటరాక్ట్ అయిన 14 మందికి వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. మంత్రిని కాంటాక్ట్ అయి వైరస్ సోకిన వారిలో ఐదుగురు అతని సెక్యూరిటీ గార్డులు ఉండగా.. వంట మనిషి, కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మంత్రి జితేంద్ర నుంచి మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత ఆనంద్ పరన్‌జపేకు కూడా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

English summary
maharashtra Housing Minister Jitendra Awhad has tested positive for deadly novel coronavirus. he had admitted himself to a private hospital in Thane for a precautionary check-up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X