వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పులు మోయించిన మహిళా మంత్రి(ఫొటో)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు... పంకజ చెప్పులు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రాష్ట్రంలో కరవు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతాన్ని బుధవారం ఆమె సందర్శించారు.

ఆ సందర్భంగా పంకజ ముండే అక్కడ చెప్పులతో నడవడానికి కష్టంగా ఉందని వాటిని విడిచి ఒట్టి కాళ్లతోనే నడక సాగించారు. అనంతరం మంత్రి విడిచిన చెప్పులు ఓ సిబ్బంది చేతుల్లో పట్టుకుని మోశారు. ఈ విషయాన్ని పలు టీవీ ఛానల్స్ ఫోకస్ చేశాయి.

Maharashtra Minister Pankaja Munde Explains Why a Man Carried Her Slippers

కాగా, దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంపై మంత్రిని వివరణ కోరగా.. ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని, చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు.

‘చెప్పుల గురించి కంటే, ముఖ్యమైన విషయం కరవు వల్ల దెబ్బతిన్న రైతుల సమస్య' అని పేర్కొంటూనే, 'ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది' అని మంత్రి పంజక వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్ నస్సీర్ జకారియా మాత్రం.. ఈ ఘటన మంత్రి వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసిందని, ఓ పేదవాడితో చెప్పులు మోపించిన వ్యక్తి రైతులకు, సాధారణ పౌరులకు ఏం సేవ చేస్తారని విమర్శించారు.

English summary
Maharashtra Minister Pankaja Munde has bristled at accusations of imperious behavior after a man was seen carrying her slippers when she was walking on a muddy road recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X