వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలతో పాటు బ్యాలెట్‌ పేపర్లు కూడా- మహారాష్ట్ర కీలక నిర్ణయం- త్వరలో బిల్లు

|
Google Oneindia TeluguNews

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడల్లా తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఈవీఎంల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలు బీజేపీకి మేలు చేస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది.
ఈవీఎంల స్ధానంలో తిరిగి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ధాక్రే సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేస్తూ త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సంకీర్ణ సర్కారు సిద్ధమవుతోంది. అదే జరిగితే దేశంలో తొలిసారిగా తిరిగి బ్యాలెట్‌ వాడనున్న తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కనుంది.

ఎన్నికలపై మహా సర్కారు నిర్ణయం

ఎన్నికలపై మహా సర్కారు నిర్ణయం

దేశవ్యాప్తంగా పలు ఎన్నికల్లో చర్చనీయాంశమవుతున్న ఈవీఎంల విషయంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ధాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈవీఎంల స్ధానంలో పలు చోట్ల తిరిగి బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్న ప్రభుత్వం త్వరలో చట్టంలో మార్పులు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఈవీఎంలు, బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు

ఈవీఎంలు, బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు

ఈవీఎంల స్ధానంలో పలు చోట్ల బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాని నిర్ణయించిన మహావికాస్ అఘాఢీ సర్కారు దీనిపై ఇప్పుడు కసరత్తు చేస్తోంది. బ్యాలెట్‌ పేపర్లను తీసుకొచ్చినంత మాత్రాన ఈవీఎంలను రద్దు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఈవీఎంలతో పాటు బ్యాలెట్‌ పేపర్లను కూడా ఎన్నికల్లో వాడబోతున్నారు. స్ధానిక పరిస్ధితుల ఆధారంగా ఏ విధానం వాడాలన్న దానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులో ప్రభుత్వం స్పష్టత ఇవ్వబోతోంది.

అసెంబ్లీ, స్దానిక ఎన్నికలకు మాత్రమే

అసెంబ్లీ, స్దానిక ఎన్నికలకు మాత్రమే

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈవీఎంలతో నిర్వహిస్తున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికలను వదిలిపెట్టి అసెంబ్లీ, స్ధానిక సంస్ధల ఎన్నికలను ఇలా ఈవీఎంల, బ్యాలెట్‌ విధానాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేసే అధికారం కలిగి ఉందా లేదా అనే చర్చ సాగుతోంది.

తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు

తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు

రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు మాత్రమే ప్రత్యేకంగా ఈవీఎం, బ్యాలెట్‌ విధానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అనే ప్రశ్నపై ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పటోలే స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 328 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా చట్టం చేసే అధికారం ఉందన్నారు. దీనికి కేంద్రంతో సంబంధం లేదన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో ఈ మేరకు ఈ మేరకు బిల్లు ప్రవేశపెడతామని స్పీకర్ తెలిపారు. అదే జరిగితే దేశంలో ఇలా రెండు విధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న తొలిసర్కారుగా మహారాష్ట్ర రికార్డులకెక్కనుంది.

English summary
The Maharashtra government is considering reintroducing ballot papers as a mode of conducting elections, and may introduce a bill during the state assembly's Budget Session, which is likely to start from March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X