• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీస్ బాస్ చెరలో 17 ఏళ్ల అమ్మాయి: నిర్బంధించి..అత్యాచారం: మిస్సింగ్..సీసీటీవీ ఫుటేజీల్లో..!

|

ముంబై: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 అమ్మాయిని చెరబట్టారు ఓ పోలీసు ఉన్నతాధికారి. ఆమెను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిర్వహించిన దర్యాప్తు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోలీసు ఉన్నతాధికారి దురాగతాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ట్రంప్ అధికారాలకు కత్తెర: ఇరాన్‌పై యుద్ధం కుదరదిక..!

 ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉంటూ..

ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉంటూ..

ఆ పోలీస్ బాస్ పేరు నిషికాంత్ మోరె. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌. పుణేలో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డీటీసీగా పనిచేస్తున్నారు. తనకు బాగా పరిచయం ఉన్న ఓ కుటుంబానికి చెందిన అమ్మాయిపై కొద్దిరోజులగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. తాను ఐపీఎస్ అధికారినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అతని దురాగతాన్ని భరించలేక ఆ బాలిక కిందటి నెల 27వ తేదీన తలోజా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ..

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ..

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మోరేపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాధితురాలిపై బెదిరింపులు తీవ్రం అయ్యాయి. కుటుంబ సభ్యులపై ద్వారా కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. కొద్దిరోజులుగా తల్లిదండ్రులు సైతం అతనికే వత్తాసు పలికారు. ఈ పరిస్థితుల మధ్య బాధితురాలు అదృశ్యం అయ్యారు. సోమవారం నుంచి ఆమె కనిపించకుండా పోయారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రాసిన ఓ లేఖ ఇంట్లో లభించింది.

సీసీటీవీ ఫుటేజీల్లో..

సీసీటీవీ ఫుటేజీల్లో..

దీనితో బాధితురాలి తల్లిదండ్రులు తలోజా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం నాటి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. బాధితురాలు ఓ లగేజీ బ్యాగ్‌ను తీసుకుని ఒంటరిగా అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. బాధితురాలి కోసం ప్రస్తుతం తలోజా పోలీసులు గాలిస్తున్నారు. బాలికపై అత్యాచారం, అదృశ్యం కావడానికి ప్రధాన కారణం నిషికాంత్ మోరే కావడం.. అతని ఒత్తిళ్ల వల్లే బాలిక కనిపించకుండా పోయిందంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు.

బెయిల్ పిటీషన్ కొట్టివేత..

బెయిల్ పిటీషన్ కొట్టివేత..

ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన నిషికాంత్ మోరేను పోలీసులు అరెస్టు చేశారు. బెెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటీషన్‌ను పన్వెల్ న్యాయస్థానం కొట్టి పారేసింది. అత్యాచారాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. శిక్షను అనుభవించక తప్పదని వ్యాఖ్యానించింది. అతని చర్యలను మహారాష్ట్ర ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణించింది. నిషికాంత్ మోరేను సస్పెండ్ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
Maharashtra's home department on Thursday suspended Deputy Inspector General Nishikant More. Nishikant More is accused of molesting a 17-year old girl. In another development, Panvel court rejected Nishikant More's arrest bail application. Shocking developments in the case have come to light after registration of the offence since Monday. The girl from Navi Mumbai who filed a molestation case is missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X