వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra: హమ్మయ్యా.... ఏడాది పూర్తి చేసుకున్న సీఎం, అన్నీ సినిమా కష్టాలే, వర్క్ ఫ్రమ్ హోమ్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేసినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన కుర్చీని ఏడాదిపాటు కాపాడుకుంటూ వచ్చారు. ఏ ముహూర్తాన సీఎం పదవిలో ఉద్దవ్ ఠాక్రే కుర్చున్నారో ఆ రోజు నుంచి ఆయన ఎక్కువ కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ చేతకాని పరిపాలన చేశారని, ఈ ముఖ్యమంత్రి ఇంటి నుంచి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Kangana: కంగనా సిస్టర్స్ కు రిలీఫ్, డేట్ ఫిక్స్ చేసిన హైకోర్టు, ఆ రోజు పోలీసులకు మండితే అంతే !Kangana: కంగనా సిస్టర్స్ కు రిలీఫ్, డేట్ ఫిక్స్ చేసిన హైకోర్టు, ఆ రోజు పోలీసులకు మండితే అంతే !

 2019 అక్టోబర్ 19వ తేదీ ఫలితాలు

2019 అక్టోబర్ 19వ తేదీ ఫలితాలు

గత ఏడాది అక్టోబర్ 19వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ- శివసేన పార్టీల మధ్య సీఎం కుర్చీ కోసం పోరు మొదలైయ్యింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహేబ్ ఠాక్రే కోరిక మేరకు ఆయన వారసుడు ఉద్దవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిని చెయ్యాలని శివసేన నాయకులు పట్టుబట్టడంతో అక్కడే అసలుసిసలైన లొల్లి మొదలైయ్యింది.

రాష్ట్రపతి పాలనా పెట్టినా వెనక్కి తగ్గని శివసేన

రాష్ట్రపతి పాలనా పెట్టినా వెనక్కి తగ్గని శివసేన

అప్పట్లో మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. ఎన్సీపీ చీలిపోయి ఓ వర్గం బీజేపీకి మద్దతు ఇవ్వడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడు రోజులు ముఖ్యమంత్రి అయ్యారు. అయినా శివసేన వెనక్కి తగ్గకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు చేశారు. ముఖ్యమంత్రి స్థానం తమకే కావాలని శివసేన నాయకులు తేల్చి చెప్పడంతో బీజేపీ నాయకులు సీఎం కుర్చీ ఇవ్వమని తేల్చి చెప్పారు.

 నవంబర్ 28వ తేదీ ముహూర్తం

నవంబర్ 28వ తేదీ ముహూర్తం

బీజేపీ నాయకులతో తెగతెంపులు చేసుకున్న శివసేన కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 28వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ఏ ముహూర్తానా ఉద్దవ్ ఠాక్రే సీఎం సీటులో కుర్చున్నారో అప్పటి నుంచి ఆయనకు అన్ని సినిమా కష్టాలు ఎదరైనాయి.

వరదలు, కరోనా కష్టాలు

వరదలు, కరోనా కష్టాలు

ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా మహారాష్ట్ర తూర్పు విభాగంలో వరదలు, మహారాష్ట్ర మరాఠా ప్రాంతాల్లో భారీ వర్షాల దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదలు, భారీ వర్షాల దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్న సమయంలో ముంబాయి నగరంతో సహ మహారాష్ట్ర పశ్చిమ విభాగాల్లో కరోనా వైరస్ (COVID-19) భరతనాట్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతకుల గురిచేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం, డ్రగ్స్ కేసులో సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మీద ఆరోపణలు రావడం విమర్శలకు దారితీసింది.

 అందుకేనా

అందుకేనా

భారీ వర్షాలు, వరదలు, కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా ఆయన ఇంటికే పరిమితం అయ్యి విధులు నిర్వహించారు. ఇదే సమయంలో ఇంటికే పరిమితం అయిన సీఎం ప్రజల కష్టాలకు గాలికి వదిలేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 40 లక్షల మంది రైతులకు రూ. 38 వేల కోట్ల రుణమాఫీ చేసింది. తాము ఇలాంటి అభివృద్ది పనులు చేశామని చెప్పుకోవడానికి ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ఏమీ లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

English summary
Maharashtra: MVA government completes a year. More challenges ahead for Shiv Sena- Congress- NCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X