వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్‌కు పట్టాభిషేకం: కిచిడీ సర్కార్ కాదు.. సుస్థిర ప్రభుత్వం కావాలి: దేవేంద్ర ఫడ్నవీస్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. అందుకోసమే బీజేపీ విధానాలు నచ్చే కొందరు మద్దతిచ్చారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు, కొందరు శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పడింది.

అదను చూసి దెబ్బకొట్టారు..మోడీ-షా దెబ్బకు మూడు పార్టీలు ఫసక్అదను చూసి దెబ్బకొట్టారు..మోడీ-షా దెబ్బకు మూడు పార్టీలు ఫసక్

సుస్థిర ప్రభుత్వం

మహారాష్ట్రకు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అందుకే బీజేపీ సర్కార్ కొలువుదీరిందని చెప్పారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సర్కార్ కిచిడీ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కావాల్సింది స్టేబుల్ సర్కార్ తప్ప కలగూర గంప కాదని స్పష్టంచేశారు.

అనిశ్చితి

అనిశ్చితి

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తిరిగి పట్టం కట్టారని చెప్పారు. కానీ ఫలితాల తర్వాత శివసేన వైఖరి మారిందని మండిపడ్డారు. సీఎం పీటం కోసం పట్టుబట్టి రాష్ట్రపతి పాలనకు కారణమైందని విమర్శించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని గుర్తుచేశారు. దీనికి కారణం ఎవరు అని ఫడ్నవీస్ ప్రశ్నించారు.

కమల వికాసం

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు 145 సభ్యుల మద్దతు తప్పనిసరి. 105 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతిచ్చారు. ఎన్సీపీకి 54 సభ్యులు ఉండగా.. 22 మంది అజిత్‌తో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరితోపాటు కొందరు శివసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాందాస్ అథవాలే పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేయనుండటంతో ఆ పార్టీ మెజార్టీ నిరూపణకు ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదనిపిస్తోంది.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్
 షాక్‌లో

షాక్‌లో

వాస్తవానికి శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ పార్టీ నేతలు శనివారం గవర్నర్ కొసియారిని కలుస్తామని ప్రకటించాయి. కానీ ఇంతలో బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. శివసేన రెండున్నరేళ్లు తమకు సీఎం పదవీ ఇవ్వమని బెట్టు చేయడంతో... ఆ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేరీతిలో గుణపాఠం చెప్పింది.

English summary
devendra Fadnavis after taking oath as Maharashtra Chief Minister for the second consecutive term said that the state needed a stable government and not a 'Khichdi' government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X