వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా కానిస్టేబుల్ లింగమార్పిడి: ఉద్యోగానికి నో చెప్పిన పోలీస్ శాఖ

లింగ మార్పిడి తర్వాత కకూడ ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్‌ ఐజీపీ రాజ్‌కుమార్‌ వాట్కర్‌ ఆమెకు లేఖ రాశ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: లింగ మార్పిడి తర్వాత కకూడ ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్‌ ఐజీపీ రాజ్‌కుమార్‌ వాట్కర్‌ ఆమెకు లేఖ రాశారు.

హర్మోనల్‌ మార్పుల కారణంగా ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్‌గా జీవించాల్సి వస్తోంది. సంఘం కూడా ఆమె పట్ల వివక్షత ప్రదర్శిస్తోంది. అందుకే ఆమె లింగ మార్పిడి కోరుకుంటోందని ఆమె తరపున న్యాయవాది డాక్టర్‌ ఎజాజ్‌ అబ్బాస్‌ జౌరంగబాద్‌ ఐజీపీకి అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశారు.

Maharashtra Police reject woman constable’s plea to continue working after sex change

అయితే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నియామవళి ప్రకారం.. కానిస్టేబుల్‌ పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ. ఉండాల్సి ఉంది. అయితే 2009లో కానిస్టేబుల్‌గా చేరిన సదరు మహిళ ఎత్తు 162.5 మాత్రమే.

దీంతో ఆమెను అనుమతించటం కుదిరే పని కాదంటూ అభ్యర్థనను పోలీస్‌ శాఖ తిరస్కరించారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అబ్బాస్‌ చెబుతున్నారు.

English summary
The Maharashtra Police have rejected a 29-year-old woman’s application seeking permission to continue in the force after undergoing a sex change operation, The Times of India reported on Monday.లింగమార్పిడి చేసుకొన్న తర్వాత ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతివ్వాలంటూ మహిళా కానిస్టేబుల్ ధరఖాస్తును పోలీసు శాఖ తిరస్కరించింది. అయితే పురుషులకు, మహిళలకు రిక్రూట్‌మెంట్ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని పోలీస్ శాఖ ప్రకటించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X