వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Politics:ఎన్సీపీ-కాంగ్రెస్‌ల మధ్య చివరి సమావేశం..కీలక ప్రకటన వచ్చే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం రోజున కాంగ్రెస్ ఎన్సీపీలు మరోసారి భేటీకానున్నాయి. ఈ సమావేశం తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిద్ధాంతపరంగా విబేధాలు ఉన్న శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేనసీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన

కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చర్చలు

కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చర్చలు

రాష్ట్రపతి పాలన ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కసరత్తులు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకూడదని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే చర్చల మీద చర్చలు మూడు పార్టీలు జరుపుతున్నాయి. ఇక గురువారం కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య చివరిసారిగా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం తర్వాత ఓ కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం కూడా కొన్ని గంటల పాటు ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ సీనియర్ నేతల మధ్య చర్చలు జరిగాయి. పదవుల పంపకాలు, కామన్ మినిమమ్ ప్రోగ్రాం‌లపైనే చర్చ జరిగింది.

చర్చలు సోనియా-శరద్ పవార్‌ల సమావేశం

చర్చలు సోనియా-శరద్ పవార్‌ల సమావేశం

ఇక గురువారం కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు ఒక ప్రకటన చేసే అవకాశముంది. ఇరుపార్టీ నేతల సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లు కలిసి మరోసారి సమావేశం అవుతారు. ఈ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు శుక్రవారం రోజున ముంబై బయలుదేరి వెళతారు. అక్కడ శివసేనతో కలిసి చర్చలు జరుపుతారు. ఇదిలా ఉంటే ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కలిసి శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో రాజకీయ అనిశ్చితికి త్వరలోనే తెరపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు మూడు పార్టీలు కలిస్తేనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎన్సీపీ ముఖ్యనేత నవాబ్ మాలిక్ చెప్పారు.

సీఎం అభ్యర్థి శివసేన నుంచే: సంజయ్ రౌత్

సీఎం అభ్యర్థి శివసేన నుంచే: సంజయ్ రౌత్

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అభ్యర్థే ఉంటారని మరోసారి స్పష్టం చేశారు ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్. అయితే ఐదేళ్ల పాటు ఉంటుందా లేదా అనేదానిపై సంజయ్ రౌత్ క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వంను అందించేందుకు చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని మరో ఐదురోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. మూడు పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే అదికాస్త సమయం తీసుకుంటుందని చెప్పారు సంజయ్ రౌత్.

రొటేషన్ పద్ధతిలో సీఎం పదవి ఉండాలన్న ఎన్సీపీ

రొటేషన్ పద్ధతిలో సీఎం పదవి ఉండాలన్న ఎన్సీపీ


ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవి రొటేషనల్ పద్ధతిలో ఉండాలని ఎన్సీపీ పట్టుబడుతోంది. తొలి రెండున్నరేళ్లు శివసేనకు ఇచ్చి ఆ తర్వాత రెండున్నరేళ్లు ఎన్సీపీకి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇక కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కోరుతోంది. అంతేకాదు శివసేనకు తమకు సీట్ల సంఖ్యలో పెద్దగా తేడా లేదని కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు తమకంటే ఎక్కువగా వచ్చినట్లు చెబుతోంది. ఇక చిన్నా చితకా పార్టీలు శివసేన సిద్ధాంతంతో ఏవైతే వ్యతిరేకిస్తున్నాయో అవి కూడా కాంగ్రెస్ ఎన్సీపీలకు మద్దతు ఇస్తున్నాయన్న విషయాన్ని శరద్ పవార్ పార్టీ గుర్తుచేస్తోంది.

English summary
The Congress and Nationalist Congress Party (NCP) on Thursday are set to hold another round of meeting to give final touches to the contours of the alliance with the ideologically opposite Shiv Sena to form government in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X