వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంచేసినా తిప్పలే: అఫెన్సా..డిఫెన్సా శివసేన ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేకిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని గవర్నర్‌కు తెలపడంతో ఆ అవకాశం శివసేనకు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందకపోవడం, గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు గవర్నర్. మంగళవారం సాయంత్రం 8:30 గంటల వరకు పవార్‌కు గడువుంది. అయితే ఎన్సీపీ ప్రభుత్వం శివసేన మద్దతు తీసుకుని కాంగ్రెస్‌తో ఏర్పాటు చేస్తుందా..అనేది ఆసక్తికరంగా మారింది.

 శివసేన మద్దతు ఇస్తుందా..?

శివసేన మద్దతు ఇస్తుందా..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ అయిపోయింది, ఆ తర్వాత శివసేన ఛాన్స్ మిస్ చేసుకుంది ఇక ఎన్సీపీ చేతిలో బంతి ఉంది. అయితే ఎన్నికల్లో ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి కాబట్టి రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శివసేన మద్దతు అనివార్యం అవుతుంది. అయితే ఎన్సీపీ-కాంగ్రెస్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన బయటనుంచి మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తి రేకిస్తోంది.

 కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండనుంది..?

కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండనుంది..?

ఒకవేళ ఎన్సీపీ శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అంటే ఇవ్వదని ఇప్పటికే సోమవారం నాటి ఉదంతంతో బయటపడింది. రెండు మరాఠీ పార్టీలు కలిస్తే తదుపరి ఎన్నికల్లో పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. ఇది ఇలానే కొనసాగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదు. ఇక్కడ మరో ఆప్షన్ కూడా కనిపిస్తోంది. ముందుగా ఎన్సీపీ కాంగ్రెస్‌తో కలిసి రెండున్నరేళ్లు ప్రభుత్వంలో ఉండేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఆ తర్వాత మరో రెండున్నరేళ్లు ఎన్సీపీ శివసేనలు ప్రభుత్వంలో ఉండేలా అగ్రీమెంట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తోంది. ఇలా అయితే శివసేన మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 రాష్ట్రపతి పాలన వస్తే శివసేనపైనే నింద..?

రాష్ట్రపతి పాలన వస్తే శివసేనపైనే నింద..?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వస్తే ఇందుకు కారణం శివసేన పార్టీ అని చెప్పేందుకు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఎన్సీపీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పదవుల పందేరంకు పోయి శివసేన తమకు తాము శిక్ష విధించుకుందనే అభిప్రాయంను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ గేమ్‌ను మొత్తం బీజేపీ చాలా దగ్గరగా పరిశీలిస్తోంది. మహారాష్ట్రలో రాజకీయాలు గంటగంటకు మారుతుండటంతో దేశం మొత్తం చూపు ముంబైపైనే ఉంది. మరి శరద్ పవార్ ప్రభుత్వం ఏర్పాటులో సక్సెస్ అవుతారో లేక ఫెయిల్ అవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడక తప్పదు.

English summary
politics in Maharashtra are taking an interesting turn after the Governor invited NCP to stake claim to form government.Will Shiva sena support NCP congress led govt is all that, that is creating news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X