• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళరాత్రి: ముంబై అతలాకుతలం: నిద్రపోని దేశ ఆర్థిక రాజధాని

|

ముంబై: దేశ ఆర్థిక రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై.. మళ్లీ అదే స్థితికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల దెబ్బకు మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకర్లు నిద్రలేని రాత్రిని గడిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వీధుల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకునిపోయాయి. కరోనా వైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే ముంబై కోలుకుంటోంది. ఈ దశలో అతి భారీ వర్షాలు కురవడం.. మహమ్మారి విజృంభణకు దారి తీసే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమౌతోంది.

తెరపినిచ్చిందనకున్నా.. ఉరుములు, మెరుపులతో

ఇటీవలే ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం వరుణుడు శాంతించాడు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షం పడలేదు. కొంత తెరిపినిచ్చింది. దీనితో ముంబైకర్లు ఊపిరి పీల్చుకోగలిగారు. జనజీవనం గాడిన పడినట్టే కనిపించింది. కొంత విరామం అనంతరం వరుణుడు మళ్లీ విరుచుకుని పడ్డాడు. కొన్ని గంటల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వాతావరణ కేంద్రం అధికారుల అంచనాలు తప్పలేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మొదలైన భారీ వర్షం.. తెల్లవారుజాము వరకూ కుండపోతగా కురుస్తూనే ఉంది. చెవులు చిల్లులు పడేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉరుములు, మెరుపులు ముంబైని నిద్రపోనివ్వకుండా చేశాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం..

భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పోటెత్తింది. భండూప్, దహిసర్, బోరీవలి ఈస్ట్, అంధేరి వెస్ట్, నహుర్, సియాన్, మెరైన్ లైన్స్, ములుంద్, దేశాయ్ రోడ్, బ్రీచ్ క్యాండీ, శాంటాక్రజ్, కొలాబా, మహాలక్ష్మి, బాంద్రా, జుహు, రామ్ మందిర్, నాలాసపోరా, గోరేగావ్ వంటి అనేక ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. హనుమాన్ నగర్, కండీవలి ఈస్ట్ వంటి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. ఇంటి వద్ద పార్క్‌ చేసి ఉంచిన వాహనాలన్నీ నీట మునిగాయి. వరదనీటికి కొట్టుకుపోయాయి.

శాంటాక్రజ్‌లో అత్యధికం..

అత్యధికంగా శాంటాక్రజ్‌లో 217.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బాంద్రాలో 202, జుహు ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో 197.5 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. సియాన్ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది. దహీసర్ నది ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఒక్కసారిగా దాని నీటిమట్టం పెరగడంతో వరదనీరు వీధుల్లో ప్రవహించింది. ఇదే పరిస్థితి ఇంకొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. భారీ వర్షాలు మరింత తీవ్రత చూపే అవకాశం ఉందనే కారణంతో ఇదివరకే వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.

  Southwest Monsoon కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం | Weather Update | IMD || Oneindia Telugu

  English summary
  Maharashtra: Rain lashes Mumbai, Rainwater entered houses in Hanuman Nagar, Kandivali East and Borivali east area following a heavy downpour this morning.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X