వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: ఇళ్లపై కొండచరియలు పడి 36మంది దుర్మరణం, శిథిలాల్లో ఇంకొందరు -భారీ వర్షాల వల్ల

|
Google Oneindia TeluguNews

గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలం అయింది. రాజధాని ముంబైతోపాటు థానే, రత్నగిరి, రాయ్‌గఢ్‌, కొల్ఘాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానల వల్ల పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరగ్గా, తాజాగా ఇంకొన్ని ఘోర సంఘటనలు చోటుచేసుకున్నాయి..

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

రికార్డు స్థాయిలో అసాధారణ వర్షం కురవడంతో రాయ్‌గఢ్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలోని మహద్‌తలై సహా మూడు ప్రాంతాల్లో శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ధాటికి విరిగిపడ్డ కొండచరియలు, బురద ప్రవాహం ఇళ్లను ముచెత్తడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

Maharashtra rains: 36 dead in Raigad landslide, several trapped

రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారమందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్లు రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ తెలిపారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Maharashtra rains: 36 dead in Raigad landslide, several trapped

పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్

Maharashtra rains: 36 dead in Raigad landslide, several trapped

మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబయి- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షాల ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. కొండచరియలు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి సమీక్షిస్తున్నారు..

English summary
As Maharashtra rain fury rages across the state, a total of 36 people died in the district due to landslides, 32 of them died in Talai and 4 in Sakhar Sutar Wadi. 30 people trapped, said Nidhi Chaudhary, District Collector, Raigad on Thursday. A team of NDRF has reached Mahad, around 160 km from Mumbai, and another will reach there soon, the official said. Chief Minister Uddhav Thackeray is reviewing the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X