మహారాష్ట్రలో సబ్ వేరియంట్ కేసు.. మరింత ఆందోళన
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వస్తూనే ఉన్నాయి. తొలుత తెలంగాణలో రాగా.. తర్వాత మిగతా రాష్ట్రాల్లో వస్తున్నాయి. మహారాష్ట్రలో బీఏ 4 వేరియంట్ నాలుగు కేసులు... బీఏ 5 వేరియంట్ 3 కేసులు మహారాష్ట్రాలో వెలుగుచూశాయి. అయితే అందరికీ మైల్డ్్ సింప్టమ్స్ కనిపించాయి. ఏప్రిల్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా, ఇతర దేశాల్లో వచ్చాయి. పుణేలో గల ఏడుగురు రోగులకు కూడా సబ్ వేరియంట్స్ వచ్చాయి.
ఒమిక్రాన్ వేరియంట్ బీఏ4వైరస్ తొలి కేసు తెలంగాణలో నమోదవగా..రెండో కేసు తమిళనాడులో గుర్తించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వైరస్ సోకిన వ్యక్తి చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని చెంగల్పట్టు జిల్లాలోని నవలూర్ నివాసిగా గుర్తించినట్లు తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రకటించింది.

చెన్నైలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసు నమోదైన వ్యక్తిలో లక్షణాలు లేకపోయినప్పటికి కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్సింగ్ నెట్వర్క్ టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చిందని రిపోర్ట్ ద్వారా తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ4 కేసు నమోదవడంతో తమిళనాడు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైతే బాధిత వ్యక్తి ఉన్నాడో అతనితో కాంటాక్ట్ అయిన వాళ్లను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా దేశాన్ని వదిలిపోయినా.. ఏదో రూపంలో కొత్త వేరియెంట్ భారత్‌లో పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. బాధితుడి శాంపిల్స్ పరిశీలించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా B.A4 వేరియంట్‌గా వైరస్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఈతరహా వైరస్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈనెల 9వ తేదిన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ని గుర్తించారు. అతను తెలంగాణ, భారత్‌కి చెందిన వ్యక్తి కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.