వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడపైనే విమానం తయారుచేశాడు.. రూ.35 వేల కోట్ల డీల్ కొట్టేశాడు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: తన ఇంటి మేడపై ఓ చిన్న విమానాన్ని తయారు చేసిన ఓ పైలట్‌‌కు ఏకంగా విమానాలు తయారు చేసే అవకాశం ప్రభుత్వం నుంచి లభించింది. అది కూడా ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్ల ప్రాజెక్టు దక్కింది.

వివరాల్లోకి వెళితే... కెప్టెన్ అమోల్ యాదవ్ ముంబయిలోని కండివాలి సబర్బ్‌లోని తన ఇంటి మేడపై ఆరేళ్లపాటు శ్రమించి ఆరుగురు కుర్చునే వీలున్న విమానం తయారు చేశారు. ముంబయిలో జరిగిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ఆ విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు.

amol-yadav

ఈ విమానాన్ని చూసిన పౌర విమానాయాన శాఖ మంత్రి పి.అశోక గజపతి రాజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు అమోల్ యాదవ్ పనితనానికి ముగ్ధులయ్యారు. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదించి కేవలం 90 రోజుల్లోనే రిజిస్టర్ చేయించారు.

కెప్టెన్ అమోల్ యాదవ్ తన తొలి విమానం తయారీని 2011 లో మొదలుపెట్టి 2016 నాటికి పూర్తి చేశారు. 2017లో ఈ విమానానికి ఏరియల్ టెస్టులు నిర్వహించేందుకు డీజీసీఎ నుంచి అనుమతి లభించింది. విమానం విజయవంతంగా ఎగరడంతో ఆయనతో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అమోల్ యాదవ్‌కు చెందిన థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం రూ.35వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం అమోల్ యాదవ్‌కు పాల్ఘార్‌లోని 155 ఎకరాలు కేటాయించనున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' కింద ఈయన కంపెనీ చిన్న విమానాలను తయారు చేసి అందివ్వాల్సి ఉంటుంది.

English summary
The Maharashtra government on Monday cleared the decks for India's first individual aircraft maker Captain Amol Yadav to set up an indigenous factory for manufacturing 20-seater aircraft in Palghar in a Rs 35,000 crore project, an official said. Yadav created waves in February 2016, when he constructed a small airplane on his building terrace and displayed it at the 'Make In India' mega-event in Mumbai. The Devendra Fadnavis government signed a MoU with Yadav's Thrust Aircraft Pvt Ltd, India, to set up the plant to build small aircraft and develop Palghar as a new aviation hub. The government had already announced that the company of the 41-year-old Deputy Chief Pilot with Jet Airways, would be allotted around 155 acres of land in Palghar, around 100 km from Mumbai, to implement the project as part of the 'Make In India' initiative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X