వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 18-44ఏళ్ల వారికి టీకాల్లేవు -వ్యాక్సిన్ల కొరత తీవ్రతరం -ఉన్న డోసులు 45ప్లస్ వారికి బదలాయింపు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వ్యాప్తి, కొవిడ్ మరణాలు నానాటికీ పెరుగుతుండగా, వైరస్ కు విరుగుడుగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నా కేంద్రం హడావుడిగా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం, 18 నుంచి 45ఏళ్లలోపు వయసువారికి టీకాలు అందించే బాధ్యతను రాష్ట్రాలపైకే నెట్టేయడంతో ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Telangana Lockdown: రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే: బీజేపీ బండి సంజయ్ అనూహ్యంTelangana Lockdown: రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే: బీజేపీ బండి సంజయ్ అనూహ్యం

కేంద్రం చెప్పినట్లు మే 1 నుంచి కాకుండా జూన్ లేదా ఆగస్టుల్లో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెడతామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా కొవిడ్ కు మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్ర కూడా 18 నుంచి 44 ఏళ్ల వయసువారికి టీకాల పంపిణీని నిలిపేసింది. కొవిన్ యాప్ ద్వారా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న (18-44 ఏజ్ గ్రూప్)వారికి వ్యాక్సిన్లు అందించలేమని మహా సర్కారు కుండబద్దలు కొట్టింది..

Maharashtra suspends COVID-19 vaccine drive for 18-44 age group due to shortage

టీకాల పంపిణీపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడియన ఆయన.. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఆ వయసుల వారికోసం కేటాయించిన 3 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులను 45 ఏళ్లు పైబడిన వారికి బదలాయిస్తున్నామన్నారు.

 వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్ వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్

''45ఏళ్లు దాటిన వారిలో ఇప్పటికే తొలి డోసు తీసుకుని, రెండో డోసు కోసం ఎదురు చూస్తోన్నవారి సంఖ్య 5లక్షలకుపైగా ఉంది. కానీ వారి కోసం నిర్దేశించిన టీకాలు మాత్రం 35 వేల డోసులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 18-44 ఏళ్ల వారికి కేటాయించిన 2.75 లక్షల కొవాగ్జిన్ డోసులను 45ప్లస్ వారికి బదలాయిస్తున్నాం. అయితే, ఈ నిలిపివేత తాత్కాలికం మాత్రమే. వ్యాక్సిన్ల లభ్యత పెరిగిన తర్వాత తదుపరి ఆదేశాలిస్తాం'' అని ఆరోగ్య మంత్రి తోపే చెప్పారు. కాగా,

Maharashtra suspends COVID-19 vaccine drive for 18-44 age group due to shortage

వ్యాక్సిన్ల కొరత కారణంగా 18నుంచి 44 ఏళ్ల వయసువారికి పంపిణీ నిలిపేస్తున్నట్లు రాష్ట్రాలు చెబుతున్నా, కేంద్రం వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అన్ని రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఉచితంగా వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని, వ్యాక్సినేష‌న్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 18 కోట్ల ఉచిత‌ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికీ రాష్ట్రాల ద‌గ్గ‌ర 90 లక్ష‌ల ఉచిత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని, మ‌రో మూడు రోజుల్లో మ‌రో 7 ఏడు ల‌క్ష‌ల‌కుపైగా ఉచిత వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

English summary
The Government of Maharashtra on Tuesday suspended the COVID-19 vaccination drive for the 18-44 age group due to a shortage of jabs. State Health Minister Rajesh Tope told the media that the government has decided to prioritise the second dose of the 45+ age group people with the remaining stock of vaccines. The minister said the move, however, is temporary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X