వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..

|
Google Oneindia TeluguNews

శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్దవ్ థాకరే తొలిసారి ఢిల్లీ వచ్చారు.

సహచర మంత్రి ఆదిత్య థాకరేతో కలిసి ఉద్దవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ మర్యాదపూర్వకమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసిన శివసేన-బీజేపీ తర్వాత సీఎం సీటు కోసం విభేదించి బయటకొచ్చినా సంగతి తెలిసిందే. తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి 'మహా వికాస్ ఆఘడి' పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. దేవంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంత్రి పదవులు చేపట్టారు.

maharashtra Uddhav Thackeray met PM narendra Modi

ప్రధాని మోడీతో సమావేశం తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో సమావేశమవుతారు. తర్వాత యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో మీట్ అవుతారు.. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని శివసేన పార్టీ వర్గాలు తెలియజేశాయి.

English summary
Maharashtra Chief Minister Uddhav Thackeray met Prime Minister Narendra Modi here on Friday, his first visit to the national capital after taking over the reins of the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X