వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విన్నారా: ఠాక్రే ఆస్తి కంటే మహారాష్ట్ర సీఎం ఆస్తి ఇంత తక్కువా ? ఆశ్చర్యం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆ రాష్ట్రంలోని నాగపుర నైఖుత్య శాసన సభ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫడవిట్ లో చాల ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాల్ ఠాక్రే మనుమడు ఆదిత్య ఠాక్రే కంటే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్తులు చాల తక్కువగా ఉన్నాయని వెలుగు చూటంతో మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !

బీజేపీ, శివసేన లెక్కలు

బీజేపీ, శివసేన లెక్కలు

మహారాష్ట్రలో మొత్తం 288 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 శాసన సభ ఎన్నికల్లో 150 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ, 124 నియోజక వర్గాల్లో శివసేన, 14 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ, శివసేన మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. 2014 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేశాయి. 2014 శాసన సభ ఎన్నికల్లో 260 నియోజక వర్గాల్లో పోటీ చేసిన బీజేపీ 122 చోట్ల విజయం సాధించింది. 282 నియోజక వర్గాల్లో పోటీ చేసిన శివసేన 63 నియోజక వర్గాలో విజయం సాధించింది.

 ఆదిత్య ఠాక్రే ఆస్తి కంటే సీఎం ఆస్తి ఇంత తక్కువా ?

ఆదిత్య ఠాక్రే ఆస్తి కంటే సీఎం ఆస్తి ఇంత తక్కువా ?

బాల్ ఠాక్రే మనుమడు, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్నారు. ఆదిత్య ఠాక్రే కంటే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు రూ. 3.78 కోట్ల స్థిరాస్తి ఉందని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. స్థిరాస్తితో పాటు రూ. 2.33 కోట్ల షేర్లు ఉన్నాయని, బ్యాంకుల్లో రూ. 8. 29 లక్షలు ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అఫిడవిట్ లో వివరించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే కంటే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్తులు చాలా తక్కువ. (ఫోటో పీటీఐ)

 క్రిమినల్ కేసులు, సుప్రీం కోర్టులో !

క్రిమినల్ కేసులు, సుప్రీం కోర్టులో !

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అయితే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీద నాలుగు ప్రైవేటు కేసులు ఉన్నాయి. సతీష్ ఉకే అనే వ్యక్తి వేసిన ప్రైవేటు కేసులు విచారణలో ఉన్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీద సుప్రీం కోర్టులో ప్రైవేటు కేసులు విచారణలో ఉన్నాయి.

దేవేంద్ర ఫడ్నవిస్ స్థిరాస్తి

దేవేంద్ర ఫడ్నవిస్ స్థిరాస్తి

2014లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్థిరాస్తి విలువ రూ. 1.18 కోట్లు. అయితే ఈ ఆస్తి ఇప్పుడు రూ. 3.78 కోట్ల విలువ ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ పెరిగిపోవడంతో తన ఆస్తి విలువ పెరిగిందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో వివరించారు. (ఫోటో పీటీఐ).

సీఎం భార్య అమృతా ఆస్తి

సీఎం భార్య అమృతా ఆస్తి

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆస్తి వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. సీఎం భార్య అమృతాకు కేవలం రూ. 12,500 నగదు మాత్రమే ఉంది. సీఎం భార్య అమృతా బ్యాంకు డిపాజిట్ రూ. 3.37 లక్షలు. షేర్ మార్కెట్ లో ఆమె ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని వర్లి నియెజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆదిత్య ఠాక్రే ఆస్తుల విలువ రూ. 16.05 కోట్లు. ఆదిత్య ఠాక్రే కంటే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్లులు చాల తక్కువ. (ఫోటో పీటీఐ).

ఆదిత్య ఠాక్రే ఆస్తులు

ఆదిత్య ఠాక్రే ఆస్తులు

బాల్ ఠాక్రే మనుమడు ఆదిత్య ఠాక్రే స్థిరాస్తి విలువ రూ. 4.67 కోట్లు. ఆదిత్య ఠాక్రే చరాస్తి విలువ రూ. 11.38 కోట్లు. ఆదిత్య ఠాక్రేకి బ్యాంకులో రూ. 10, 36, 15, 218 డిపాజిట్ ఉంది. ఆదిత్య ఠాక్రే చేతిలో రూ. 30,000 నగదు మాత్రమే ఉందని ఆయన ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. మొత్తం మీద ఆదిత్య ఠాక్రే కంటే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్తులు చాల తక్కువ అని తెలుసుకున్న మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (ఫోటో పీటీఐ).

English summary
Maharasthra Assembly Election 2019: Chief Minister Devendra Fadnavis Poorer Than Aditya Thackeray, As Per Affidavit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X