వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఉప ఎన్నికలు: ఒకే నియోజక వర్గంలో ముగ్గురు మాజీ సీఎం కొడుకులు పోటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లోక్ సభ ఉప ఎన్నికల్లో ఒకే నియోజక వర్గం నుంచి ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు ఎన్నికల బరిలో నిలిచారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప విజయం సాధించారు. 2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా బీఎస్. యడ్యూరప్ప శికారిపుర నియోజక వర్గం నుంచి బీఎస్. యడ్యూరప్ప విజయం సాధించారు.

JDU (Nitish Kumar) state president, son of former CM JH Patel, Mahima Patel is contesting against BJP candidate in Shivamogga Lok Sabha by Elections 2018.

ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఎస్. యడ్యూరప్ప శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం శివమొగ్గ లోక్ నియోజక వర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై. రాఘవేంద్ర శివమొగ్గ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప శివమొగ్గ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా మధు బంగారప్ప ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీఎస్ టిక్కెట్ మీద శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా మధు బంగారప్ప బరిలో దిగారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేహెచ్. పటేల్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహిమా పటేల్ సైతం శివమొగ్గ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ పార్టీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయిన మహిమా పటేల్ గతంలో కాంగ్రెస్, జేడీఎస్ లో పని చేసి బయటకు వచ్చారు.

ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఒకే లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడంతో అందరూ ఆ నియోజక వర్గం ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీవై. రాఘవేంద్ర విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
JDU (Nitish Kumar) state president, son of former CM JH Patel, Mahima Patel is contesting against BJP candidate in Shivamogga Lok Sabha by Elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X